Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మృతుల కుటుంబాలకు
రూ.25లక్షల పరిహారం చెల్లించాలి
అ ప్రధమ సంవత్సరం విద్యార్ధులందరిని
పాస్ చేయాల్సిందే
అ విద్యార్ధి సంఘాల నేతలు...పట్టణంలో
భారీ ర్యాలీ
అ అమరవీరుల స్థూపం
వద్ద మానవాహారం
నవతెలంగాణ-కొత్తగూడెం
కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రత్యక్ష తరగతులు నిర్వహించకుండా పరీక్షలు నిర్వహించి 51శాతం మంది విద్యార్ధుల బ్రతుకులు బుగ్గిపాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ విద్యార్ధి సంఘాలు సోమవారం చేపట్టిన ఇంటర్ కళాశాలల బంద్ విజయవంతమైంది. విద్యార్థి సంఘాల పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల విద్యార్ధులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. బంద్ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి బస్టాండ్ సెంటర్లోని అమరవీరుల స్థూపం వరకు భారీ ప్రదర్శన నిర్వహించిన అనంతరం మానవాహారం నిర్మించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుశెట్టి రాహుల్, పిడిఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి సాంబ, ఎస్ఎస్ఏ జిల్లా కార్యదర్శి వీరభద్రం విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడారు. ఇంటర్ ఫలితాల్లో కేవలం 49శాతం విద్యార్ధులు మాత్రమే ఉత్తీర్ణత సాధించడం ముమ్మాటికి ప్రభుత్వ తప్పిదమేని ఉద్ఘాటించారు. ఫెయిల్ అయిన 51శాతం విద్యార్థులు, పేద, ఎజెన్సీ ప్రాంతాల విద్యార్ధులేనన్నారు. మినిమమ్ మార్కులతో విద్యార్ధులనందరిని ఉత్తీర్ణులను చేయాలని, మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని ఫక్షంలో ఉద్యమాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ ఎఫ్, ఎస్ఎస్ఏ, పిడిఎను సంఘాల జిల్లా నాయ కులు ఎస్.కె.ఫహీమ్ దాదా, జర్పుల ఉపేందర్, అజాత్, రణధీర్, అశోక్, సత్య, వివేక్, మంజుల, సాయి, అరవింద్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.