Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కళ్యాణి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి అ తుడుం దెబ్బ
నవతెలంగాణ-ఆన్నపురెడ్డిపల్లి
అన్నపురెడ్డిపల్లి సాంఘీక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో గత శుక్రవారం కళ్యాణి అనే మహిళ టీచర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన విదేతమే. కళ్యాణి మృతికి కారకులైయిన వారిని కఠినంగా శిక్షించాలని తుడం దెబ్బ ఆధ్యర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్తి రాజు ఆధ్యర్యంలో అన్నపురెడ్డిపల్లి అంబేద్కర్ సంట ర్ నందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిరసన కార్యక్రమం జరుగుతున్న సంఘటన స్థలానికి జూలూరుపాడు సీఐ నాగరాజు రాగ వారు కళ్యాణి మృతికి కారణం అయిన మన్మదరావుని ఆర్మీ సార్ జయప్రకాష్‌ని కఠినంగా శిక్షించాలని అదేవిధంగా పర్యవేక్షణ లోపంతో విధులు నిర్వహించిన ప్రిన్సిపాల్ రఫివుద్దిన్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాలలో ఆర్మీ సార్‌గా పని చేస్తున్న అతను మహిళ టీచర్ రూమ్‌లోకి వెళ్లి ఫోటోలు తీసే అధికారం ఎవరు ఇచ్చారని ఆయనకు సంబంధంలేని విషయంలో కలుగజేసుకొని పరోక్షంగా ఆమె మృతికి కారణం అయిన అతనిపై కేసు నమోదు చేయకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కళ్యాణి చనిపోయిన తరువాత మన్మధారావుని వెంటనే అదుపులోకి తీసుకోకుండా వదిలిపెట్టడం చాలా బాధాకరమన్నారు. అలాంటి వారిని కఠినంగా శిక్షించి కళ్యాణి కుటుంభానికి ప్రభుత్వం తరుపున రూ.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కోటేశ్వరరావు, ఎంపీపీ లలిత, ఊమ్మడి జిల్లా ఇంచార్జ్ రామస్వామి, ఆదివాసీ నాయుకులు నాగేంద్ర, రమేష్, రామారావు, రొంపెడు గ్రామస్తులు పాల్గొన్నారు.