Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పాండురంగాపురం రైల్వేలైన్
పొడిగింపు పట్ల కేంద్రం వివక్షత
అ రామాలయ అభివృద్ధి రూ.100 కోట్లు
నిధులు మంజూరు చేయాలి
అ ఛత్తీస్గడ్ ఎక్సైజ్ శాఖ మంత్రి
నవతెలంగాణ-భద్రాచలం
ఎన్నికలకే రామునిని పరిమితం చేస్తూ రాజకీయం చేస్తున్న కేంద్రం, భద్రాద్రి రామాలయ అభివృద్ధిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని చత్తీస్ ఘడ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొవ్వాసి లక్మా అన్నారు. సోమవారం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం రామాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానమును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి విషయంలో ఈ ప్రాంతాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. కేవలం ఎన్నికలకు మాత్రమే రాముడును వాడుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ప్రదేశాన్ని పర్యాటక ప్రాంతంగా గుర్తించిన, గుర్తింపు తగ్గ ప్రయారిటీ ఇవ్వటంలో చిత్తశుద్ధి లేదని ఆయన ఆరోపించారు. భద్రాచలం ముక్కోటి శ్రీ సీతారాముల కళ్యాణ మహౌత్సవాలు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి గొప్ప ఉత్సవాలను అభివృద్ధి విషయంలో గాని ప్రచార విషయాలలో గాని కనీస బాధ్యతలు నిర్వర్తించకపోవడం చాలా బాధాకరమని ఆయన అన్నారు. భద్రాచలానికి సుమారు పది, పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న రైల్వే లైను భక్తుల సౌకర్యార్థం బడ్జెట్ కేటాయింపులు లేకపోవడం బిజెపి ప్రభుత్వ వైఫల్యమని ఆయన ఆరోపించారు. ప్రభుత్వంలో ఉంటూ ప్రజా సంక్షేమాన్ని కాపాడవలసిన బాధ్యతగల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారే ధర్నాలు చేస్తూ వారి దిష్టిబొమ్మలు వారే తగలబెట్టడం, దొంగే దొంగ అని చందంగా ఉందని ఆయన విమర్శించారు. ఈ సిగ్గులేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో ప్రజా సంక్షేమం నిర్వీర్యం అయిందని ఆయన అన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వాన్ని కూడగట్టుకొని రెండు పర్యాయాలు గెలిచిన భద్రాచలం ఏజెన్సీ ఏరియాను, గిరిజనులకు వర్గాలకు జీవన సాపల్యం అయ్యేందుకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ లేవని ఆయన అన్నారు. టీిఆర్ఎస్ ప్రభుత్వం గెలిచిన మొదటి సంవత్సరంలో శ్రీ సీతారామ చంద్ర స్వామి వారికి ముత్యాల తలంబ్రాలు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ప్రభుత్వం తీసుకురావలసిన ముత్యాల తరంబ్రాలను మరచిందని ఆయన విమర్శించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి అభివృద్ధికి రూ.100 కోట్ల హామీ మరచిందని ఆయన అన్నారు. తక్షణమే భద్రాచల రామాలయ అభివృద్ధి రూ.100 కోట్లను రాష్ట్రప్రభుత్వం విడుదల చేయాలని ఆయన అన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భద్రాచలం ప్రాంతాన్ని ఏజెన్సీ వాసులను రామాలయ అభివృద్ధిని పరచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచల శాసనసభ్యులు పొదెం వీరయ్య, భద్రా చలం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సరేళ్ళ నరేష్, సీని యర్ కాంగ్రెస్ నాయకులు సత్య లింగం, బలుసు సతీష్, మురళి తరుణ్ మిత్రా, యూత్ కాంగ్రెస్ నాయకులు వెంకటేష్, ప్రసన్న పాల్గొన్నారు.