Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం
నవతెలంగాణ-దమ్మపేట
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా తెలంగాణలోని మా వడ్లు కొంటారా-కొనరా అనే నినాదంతో సీఎం కేసీఆర్ పిలుపుమేరకు అశ్వారావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మందలపల్లి క్రాస్ రోడ్లో సోమవారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశానికి వెన్నెముక రైతు, రైతు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, ఆయిల్‌ఫాం రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రప్రసాద్, వైస్ ఎంపీపీ దారా మల్లిఖార్జునరావు, మండల అధ్యక్షులు రాజేశ్వరరావు, పార్టీ పెద్దలు సూర్యనారాయణ, ఏఎంసీ వైస్ చైర్మన్ అచ్యుతరావు, నియోజకవర్గ నాయకులు ఆదినారాయణ, మండల ప్రదాన కార్యదర్శి దొడ్డ రమేష్, మండల యూత్ అధ్యక్షులు గోపిశాస్త్రి, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందు : రాష్ట్ర రైతాంగ సమస్యలను పట్టించుకోని కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి యుద్ధం ప్రకటించారని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింగ్ నాయక్, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు అన్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం చేతులేత్తిసిన కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిలదీస్తూ సోమవారం ఇల్లందు నియోజక వర్గ పరిధిలోని అన్ని గ్రామాలలో నిరసనలు చేపట్టారు. అందులో భాగంగానే స్థానిక జగదాంబ సెంటర్ నందు గల తెలంగాణ తల్లి విగ్రహం నుండి భారీ ర్యాలీగా ఊరూరా చావు-డప్పు మోగించి మోడీ దిష్టిబొమ్మ పాడే మోసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కేంద్రం చేతులెత్తయడంతోనే పంట మార్పిడి అనివార్యం అయిందని, వరికి బదులుగా ఇతర పంటలు వేయాలని, వాటికి అవసరమైన అన్ని చర్యలకు టీఆరెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో 2023 ఎన్నికల్లో బీజేపీని పాతరేస్తామని రాష్ట్ర టీిఆర్‌ఎస్ పార్టీ నాయకులు వనమా రాఘవేందర్ అన్నారు. సోమవారం టిఆర్ఎస్ ఆధ్వర్యంలో కొత్తగూడెం పట్టణంలో భారీ నిరసన ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. బీజేపీ శవయాత్ర చేశారు. స్థానిక రైల్వేస్టేషన్ నుండి పాత బస్ డిపో వరకు శవయాత్ర చేశారు. అనంతరం దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వనమా రాఘవేంద్రరావు మాట్లాడారు. కార్యక్రమంలో కొత్తగూడెం నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, వివిధ కమిటీలకు చైర్మెన్ల్లు, డైరెక్టర్లు, వివిధ ఆలయాల చైర్మన్లు, డైరెక్టర్లు, టిఆర్ఎస్ పార్టీ పట్టణ, మండల కమిటీ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.
మణుగూరు : కేంద్ర ప్రభుత్వమే ధాన్యం కోనుగోలు చేయాలని ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు అన్నారు. సోమవారం రాష్ట్ర పిలుపులో భాగంగా అన్ని గ్రామపంచాయతీలలో నల్ల బ్యాడ్జీలతో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్బంగా రేగా కాంతారావు మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కోను గోలు చేస్తుందన్నారు. మిగతా ధాన్యం తమకు సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వమే కోనుగోలు చేయాలని బీజేపీ నాయకులు అన డం విడ్డూరమన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 50 లక్షల మెట్రిక్ ట న్నుల ధాన్యం కోనుగోలు చేశామన్నారు. ఇంకా రైతుల వద్ద అధిక ధాన్య నిల్వలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతి నిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గోన్నారు.