Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-సెమీక్రిస్మస్ వేడుకల్లో
మాజీ ఎంపీ పొంగులేటి
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
క్రీస్తు చూపిన మార్గం శాంతియుత మార్గమని... ప్రతి ఒక్కరూ ఆ మార్గంలో పయనించి... దైవానుగ్రహం పొందాలని తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం అర్బన్ పరిధిలోని మూడవ డివిజన్ కార్పొరేటర్ మలీదు జగన్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం బల్లేపల్లి గ్రామంలో జరిగిన సెమీక్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాన్ని ఉద్ధేశించి పొంగులేటి మాట్లాడారు. సీఎం కేసీఆర్ అన్ని మతాలను సమాన గౌరవంతో చూస్తున్నారని అన్ని మతాలకు సమ న్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రైస్తవ మహిళలకు చీరలను కనుకగా అందజేశారు.
పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎంపీ పొంగులేటి
నగరంలోని 50వ డివిజన్ కార్పొరేటర్ రాపర్తి శరత్ తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శరత్‌ను, వారి కుటుంబాన్ని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అదేవిధంగా ముస్తఫానగర్‌కు చెందిన డాక్టర్ ఎ.వి. నాగేశ్వరరావు సతీమణి ఇటీవల అకాల మృతిచెందారు. ఆ కుటుంబాన్ని పరామర్శించి తన సానుభూతిని తెలిపారు.
గృహప్రవేశ వేడుకలో మాజీ ఎంపీ పొంగులేటి
టీఆర్ఎస్ పార్టీ, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభిమాని రాంబాబుకి ఇటీవల టేకులపల్లిలో తెరాస ప్రభుత్వం పేదప్రజలకు కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వచ్చింది. ఈనేపథ్యంలో సోమవారం ఆ గృహప్రవేశ వేడుక జరగ్గా పొంగులేటి ముఖ్యఅతిథిగా హాజరై ఇంటిని ప్రారంభించారు. అదేవిధంగా వారు రూపొందించిన 2022వ సంవత్సర నూతన క్యాలండర్‌ను ఆవిష్కరించారు. అలాగే సాయంత్రం నగరంలోని పార్క్ కన్వెన్షన్ హాల్లో జరిగిన సత్తుపల్లి పీఆర్డీఈ కుమార్తె వివాహా వేడుక రిసెప్షన్‌కు హాజరై వధూవరుల్దిరినీ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాల్లో పొంగులేటి వెంట కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, దొడ్డా నగేష్, కోసూరి శ్రీనివాసరావు, వరదా నర్సింహారావు, బొల్లిని నాగరాజు పాల్గొన్నారు.