Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి రాష్ట్రంలో అంతర్జాతీయ జిల్లా 3150 గవర్నరు కె.ప్రభాకర్ అధికార పర్యటనలో భాగంగా గాంధీ చౌక్ ఉమెన్స్ కాలేజీ ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు సుమారు 50 మంది బాలికలకు కాలేజీ యూనిఫామ్‌లను కాళ్ళ ఫౌండేషన్ వారు వీటిని బహూకరించారు. వాటి విలువ 50 వేల రూపాయలు ఖరీద్ చేస్తాయని తెలిపారు. అలాగే పెద్దతండ కస్తూరిబా బాలికల పాఠశాలలో హాస్టల్ విద్యార్థులకు రూ.50వేల విలువగల వంట, ఇతర పరికరములు కాళ్ళ ఫౌండేషన్ వారి ఆర్థిక సహాయంతో పంపిణీ చేసినారు. ఖమ్మం రోటరీ సర్వీసు సెంటరులో (25) మంది దివ్యాంగులకు కృత్రిమ కాళ్ళు బహూకరించారు. దీనికి ఒక లక్ష రూపాయలు అమెరికాలోని ఆర్.రవి- శైలజ దంపతులు విరాళం యన్.ఆర్.ఐ. ఫౌండేషన్ ద్వారా ఇచ్చినారు. రాత్రి జరిగిన బహిరంగ సభలో కల్లూరుకు చెందిన యం.బి.బి.యస్ విద్యార్థి గోతు నిఖిల్‌కు ప్రథమ సంవత్సరం ఫీజు చెల్లించుటకు గాను కాళ్ళ ఫౌండేషన్ కాళ్ళ పాపారావు ఇచ్చిన విరాళం రూ.50వేల చెక్కును విద్యార్థులకు అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ రోటరీ క్లబ్ ద్వారా నిరుపేదలకు చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను విద్యార్థులకు వివరించారు. భవిష్యత్తులో వారు కూడా ఉన్నత చదువులు చదివి, ఉద్యోగాలు చేస్తూ రోటరీ క్లబ్, ఎన్నారై చేస్తున్న పలు సేవ కార్యక్రమాలలో పాలు పంచుకోవాలని సూచించారు.
ఖమ్మం రోటరీక్లబ్ లింబ్ సెంటర్ ద్వారా చేయు సేవా కార్యక్రమాలను కొనియాడి, అభినందించినారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం రోటరీ ట్రస్టు చైర్మన్ పి.డి.జి.మల్లాది వాసుదేవ్, రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ పాలడుగు నాగేశ్వరరావు, అసిస్టెంట్ గవర్నరు కాళ్ళ పాపారావు, జి.టి.ఆర్. కార్యదర్శి దొడ్డపనేని సాంబశివరావు, నల్లమోతు రవీంధ్రనాథ్ ( కార్యదర్శి ), ట్రెజరర్ బి. సుధాకర్‌రావు, యన్ఆర్ఐ ప్రెసిడెంట్ బోనాల రామకృష్ణ, ప్రాజెక్టు ఇన్చార్జి పి. రంగారావు, అధ్యక్షులు బెల్లంకొండ బాబాజీ, మరియు కాలేజీలు టీచర్సు , కాలేజ్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.