Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ నిరుద్యోగులైన ఆదివాసీలకు కేటాయించాలి
అ టీఏజీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు వజ్జా సురేష్
నవతెలంగాణ-ఇల్లందు
మండలంలోని సుభాష్ నగర్ గ్రామపంచాయతీ కరెంట్ ఆఫీస్ సెంటర్లో ఉన్న సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ భద్రాచలం ఏర్పాటు చేసిన షాపింగ్ కాంప్లెక్స్‌లోని షాప్‌లు బినామీల చేతిలో ఉన్నాయని, వాటిని అర్హులైన అధివాసీలకు కేటాయించాలని, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం(టీఏజియస్)రాష్ట్ర కమిటీ సభ్యులు వజ్జ సురేష్ డిమాండ్ చేశారు. ఉపాధి లేని నిరుద్యోగులకు ఉపాధి కల్పనకై షాప్‌లు ఏర్పాటు చేసుకొని జీవించడానికి గిరిజనుల కోసం ఏర్పాటు చేసిన షాపింగ్ కాంప్లెక్స్‌లోని షాప్‌లు గిరిజనులకు కేటాయించినప్పటికీ అవి ప్రస్తుతం వారి అధీనంలో లేవన్నారు. వాటిని వెంటనే బతుకు జీవనం కొనసాగించే అర్హులకు కేటాయించాలన్నారు. తక్షణమే అధికారులు షాపింగ్ కాంప్లెక్స్‌లోని షాప్‌లను అధీనంలోకి తీసుకొని అసలైన అర్హులైన అధివాసీలకు ఇవ్వాలన్నారు. గిరిజనేతరులను బయటకు పంపించాలని అన్నారు. లేని పక్షంలో అన్ని ఆదివాసీ సంఘాలను కలుపుకొని ఆందోళన చేపడతామన్నారు.