Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మున్సిపల్, పంచాయతీ కార్మికులకు
పీఆర్ఎస్ అమలు చేయాలి
అ ధర్నా చౌక్ వద్ద కార్మిక సంఘాల జేఏసీ నేతలు
అ విజయవంతమైన ధర్నా...రోడ్డుపై బైటాయించి నిరసన
నవతెలంగాణ-కొత్తగూడెం
సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసనలు తెలుపుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికుల సహనాన్ని పరీక్షిస్తోందని, ప్రభుత్వం తమ తీరు మార్చుకొని కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎజె.రమేష్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుత్తుల సత్యనారాయణ, ఇఫ్య్టూ ఏరియా అధ్యక్షులు పి.సతీష్, జిల్లా కార్యదర్శి కొక్కు సారంగపాణి, ఐఎన్టియూసీి జిల్లా ఉపాధ్యక్షులు కె.నాగభూషణం డిమాండ్ చేశారు. మున్సిపల్ శాఖ, గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల జేఏసి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ధర్నా చౌక్‌లో ధర్నా నిర్వహించిన అనంతరం కార్యాలయం రోడ్డులై బైటాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన పిఆర్సిని కాంట్రాక్టు కార్మికులకు వర్తింపచేయాలన్నారు. ప్రధానమైన 14 డిమాండ్ల పరిష్కరించాలని జిల్లా అధికారుల ద్వారా ప్రభుత్వానికి నివేదిస్తున్నామని, స్పందించని పక్షంలో నిరవరధిక సమ్మెకు పూనుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు కొండపల్లి శ్రీధర్, డి.వీరన్న, ఎస్.శివకృష్ణ, బి.నాగేశ్వర్ రావు, కొప్పుల రవి, గంగా, సింగు, ఏఐటియుసి నాయకులు వై.శ్రీనివాసరెడ్డి, గెద్దాడ నగేష్, పిట్టల రాంచందర్, వెంకటమ్మ, గోపి, శ్రీను, ఇఫ్ట్యూ నాయకులు సురేందర్, ఎర్రయ్య, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.