Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగుల బదిలీల్లో తీరని అన్యాయం
- స్థానికత ఆధారంగా చేయాలని బాధితుల విజ్ఞప్తి
- ఏ జిల్లాకు కేటాయిస్తారో తెలియని అయోమయం
- విద్యాశాఖలో సోమవారం రాత్రి కేటాయింపులు పూర్తి!
- మార్గదర్శకాలపై స్పష్టత లేకుండానే బదిలీలు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
''జూనియర్...జూనియర్...జూనియర్...ఇటుఅటు కానీ హృదయం తోటి ఎందుకు రా..? ఈ తొందర నీకు.. అటుఇటు కానీ ఆటబమ్మని తెలిసే ఎందుకు వలచేవు..?'' ఓ 25 ఏళ్ల క్రితం 'ఇది కథ కాదు' సినిమా కోసం ఓ సినీ గేయరచయిత రాసిన గీతం ఇది. ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల్లో జూనియర్ల పరిస్థితి అటుఇటు కానీ అయోమయ స్థితే ఉంది. స్థానికత ఆధారంగా కాకుండా సీనియార్టీ ప్రాతిపదికన బదిలీలు చేస్తుండటంతో జూనియర్ల దుస్థితి ఆటబమ్మ తరహాలోనే సాగుతోంది. ఆప్షన్లకు విరుద్ధంగా బదిలీలు జరుగుతుండటంతో ఏ జిల్లాకు పంపుతారో తెలియని అయోమయ స్థితిలో ఉద్యోగులు కొట్టుమిట్టాడుతున్నారు. ఏ టీచర్ ఎక్కడ పనిచేయాలో విద్యాశాఖ మార్గదర్శకాలు ఇవ్వకపోవడంతో ఏ స్కూలుకు ఎవరిని ఏ ప్రాతిపదికన కేటాయిస్తారో అంతుబట్టని పరిస్థితి నెలకొంది. విద్యాసంవత్సరం మధ్యలో ఈ బదిలీలు చేస్తుండటంతో ఈ ప్రభావం బోధనపై పడుతుందని ఉపాధ్యాయసంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచించడం లేదని వాపోతున్నాయి. కొత్తజిల్లాలకు ఉద్యోగుల విభజన ప్రక్రియ ముగింపు దశకు చేరింది. వాస్తవానికి సోమవారం నాటికే దీనిపై స్పష్టత రావాల్సి ఉన్నా ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల మూలంగా ఈ ప్రక్రియ రెండురోజులు ఆలస్యంగా కొనసాగుతోంది. 22వ తేదీ నాటికి ఉద్యోగుల కేటాయింపు పూర్తి చేయాలని ప్రభుత్వం నుంచి కలెక్టర్లకు మార్గదర్శకాలు అందినట్లు తెలిసింది. విద్యాశాఖ కేటాయింపులు మాత్రం తుది దశకు చేరాయని సమాచారం. ఇప్పటికే పీఈటీల కేటాయింపు పూర్తయినట్లు చెబుతున్నారు. మిగిలిన కేటగిరీలకు చెందిన ఉపాధ్యాయుల కేటాయింపు కూడా సోమవారం రాత్రి 11 గంటలకల్లా పూర్తయినట్లు తెలిసింది.
- గందరగోళంగా జూనియర్ల పరిస్థితి...
ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉద్యోగులను ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు కేటాయిస్తున్నారు. దీనిలో భాగంగా విద్యాశాఖ కేటాయింపులు దాదాపు పూర్తయ్యాయి. ఉమ్మడి జిల్లాలో వివిధ కేటగరీల కింద 9,161 మంది టీచర్లు ఉన్నారు. వీరిలో ఖమ్మం జిల్లాకు 4,890, కొత్తగూడెం జిల్లాకు 3,666, మహబూబాబాద్ 350, ములుగు జిల్లాకు 255 మందిని కేటాయించినట్లు చెబుతున్నారు. జిల్లాలోని విద్యాశాఖ ఉద్యోగుల్లో సుమారు ఓ వెయ్యి మందికి కేటాయింపుల్లో అన్యాయం జరిగినట్లు ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. సీనియార్టీ ఆధారంగా జరిగినీఈ కేటాయింపుల్లో అనేక రకాల అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. నకిలీ ధ్రువీకరణ పత్రాలతో కొందరు లబ్ధి పొందినట్లు చెబుతున్నారు. మొత్తం 500 మంది మెడికల్ సర్టిఫికెట్లు పరిశీలించగా దాదాపు 200 మందివి నకిలీ సర్టిఫికెట్లుగా నిర్ధారణైందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. కొందరు పర్సంటేజీని పెంచి సర్టిఫికెట్లు తీసుకున్నట్లు వెల్లడైంది. జిల్లాలో 61 శాఖలకు గాను సగం శాఖల ఉద్యోగుల విభజన దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు, మహబూబాబాద్ జిల్లా గార్ల, బయ్యారం మండలాల్లో సుమారు 17,500 మంది ఉద్యోగులు విధి నిర్వహణలో ఉన్నారు. ముందుగా జిల్లాస్థాయి బదిలీ జాబితాలో ఉన్న జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్, అటెండర్ తదితర స్థాయి ఉద్యోగుల కేటాయింపులు పూర్తి చేస్తున్నారు. వీరిలో 20 నుంచి 30 శాతం మందికి మాత్రమే బదిలీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
- నేటి రాత్రిలోగా సెల్మెసేజ్లు...
మంగళవారం విభజన ప్రక్రియను పూర్తి చేసి నేటి రాత్రి వరకు సిబ్బంది వ్యక్తిగత నంబర్లకు సెల్మెసేజ్లు పంపుతారని సమాచారం. కోర్టు సమస్యలు ఉత్పన్నం కాకుండా వ్యక్తిగతంగా మెసేజ్‌లు చేస్తారని తెలుస్తోంది. స్పాస్ కేసు కింద ప్రాధాన్యతనిచ్చే భార్యభర్తలకు ఒకేచోట పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉన్నా...దీనిలోనూ స్థానికత అంశాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. భార్య ఉన్న చోటకు భర్తను ట్రాన్స్ఫర్ చేయడం కానీ లేదా భర్త ఉన్న చోటకు భార్యను పంపడం కానీ చేస్తారని సమాచారం. దీనిపైనా ఉద్యోగ వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
- పారదర్శకత లోపించిందని ఆందోళన
విద్యాశాఖ బదిలీల్లో పారదర్శకత లోపించిందని సోమవారం సాయంత్రం సమయంలో కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు కొద్దిసేపు ఆందోళన నిర్వహించారు. కేటాయింపులపై పలు రకాల అభ్యంతరాలు వెలిబుచ్చారు. రాష్ట్రప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 317 తేదీ 6.12.21లోని నిబంధనలు ఉపాధ్యాయుల్లో తీవ్రమైన భయాందోళనకు కారణమవుతున్నాయి. స్థానికత ఆధారంగా కాకుండా సీనియార్టీ ప్రాతిపదికన బదిలీలు చేస్తూ బలవంతంగా ఇతర జిల్లాకు పంపుతున్నారనేది ప్రధాన ఆరోపణ. సీనియార్టీ జాబితా కూడా లోపభూయిష్టంగా ఉందంటున్నారు. ఉపాధ్యాయుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవడం లేదని వాపోతున్నారు. డిసెంబర్ 13న విద్యాశాఖ మంత్రితో నిర్వహించిన సమావేశంలో సూచనలను కేటాయింపుల్లో పరిగణలోకి తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. నూతన జిల్లాలో 80% పోస్టులను ఆ జిల్లా స్థానికులకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.
అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలి...
- పారుపల్లి నాగేశ్వరరావు, టీఎస్‌యూటీఎఫ్ ఖమ్మం జిల్లా కార్యదర్శి
ఉమ్మడి జిల్లాలో 9,000కు పైగా ఉన్న విద్యాశాఖ ఉద్యోగుల్లో వెయ్యి మందికి పైగా అన్యాయం జరిగింది. వారి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకో వాలి. దీని పరిష్కారం కోసం గ్రీవెన్స్ పెట్టి అప్పీల్స్ ఏమైనా ఉన్నా సెటిల్ చేయమని కోరుతు న్నాం. జిల్లాల కేటాయింపు తర్వాత పాఠశాలల కేటాయి ంపుపై మార్గదర్శకాలు ఇవ్వాలని కోరుతున్నాం. జిల్లాల్లో పరస్పర అంగీకార బదిలీకి అవకాశం ఇవ్వాలని అడుగుతు న్నాం. ఫైనల్ సీనియార్టీ జాబితాను విడుదల చేశాకే ఆప్షన్స్ ఆధారంగా జిల్లాలు కేటాయించాలని మా డిమాండ్.