Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాల్వంచ
కొత్తగూడెం థర్మల్ పవర్‌స్టేషన్ ఏడవ దశ స్పోర్ట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి టీఎస్ జెన్కో ఇంటర్ ప్రాజెక్టు హాకీ టోర్నమెంట్స్ పాల్వంచలో స్థానిక విద్యుత్ కళాభారతి మైదానంలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ టోర్నమెంట్‌కు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీఎస్ జెన్కో క్రీడాకారులు పాల్గొన్నారు. ఏడు జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొనగా అందులో కేటిపిఎస్ ఏడవ దశ, కేటిపిఎస్ ఐదు, ఆరు దశలు కేటిపిపి భూపాలపల్లి, బిటిపిఎస్ మణుగూరు, విద్యుత్సౌధా హైదరాబాద్, రామగుండం, పోచంపాడు, జట్లు పాల్గొన్నాయి. ఈ క్రీడాపోటీలు లీగ్ పద్ధతిలో మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా కేటిపిఎస్ ఓ ఆండ్ ఎమ్ ఐదు ఆరు ఏడు దశల చీఫ్ ఇంజనీర్స్ కే.రవీంద్రకుమార్, పి.వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడలు శరీరదారుఢ్యానికి మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని ఉద్యోగ కార్మికులు విధి నిర్వహణతోపాటు క్రీడల్లో కూడా రాష్ట్ర జాతీయ అంతర్జాతీయస్థాయిలో రాణించాలని క్రీడాకారులకు సూచిం చారు. కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ ట్రైయినింగ్ ఇన్స్‌స్టిట్యూట్ పి.ఉపేందర్, ఎస్ఈ గుర్రం రాజ్‌కుమార్, ఎస్ఈ యుగపతి, టీఎస్ జెన్కో స్పోర్ట్స్ ఆఫీసర్ లోహిత్ ఆనంద్, కేటిపిఎస్ ఏడవ దశ గేమ్స్ సెక్రటరీ వై.వెంకటేశ్వర్లు, కేటిపిఎస్ ఐదు ఆరుదశల గేమ్స్ సెక్రటరీ వీరస్వామం పాల్గొన్నారు.