Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ వేలాదిగా తరలి వచ్చి చూసి తరించిన భక్త జనం
అ ప్రతిష్టా మహోత్సవాలకు హాజరైన ఎమ్మెల్యే పొదెం
అ ఆలయ నిర్మాణంతో (చిన్న అరుణాచలంగా)
వెలుగొందనున్న నర్సాపురం
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మండల పరిధిలోని భద్రాచలం, పర్ణశాల మార్గమధ్యలో గల నర్సాపురం గ్రామంలో ప్రధాన రహదారి పక్కనే బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ దివ్య ఆశీస్సులతో శివ సేవకుడు ఆలయ వ్యవస్థాపకులు, శ్రీ అరుణాచలేశ్వరస్వామి ట్రస్టు శివనాగస్వామి ఆద్వర్యంలో నిర్మించిన ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం (చిన్నఅరుణాచలం)లో గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న విగ్రహ ప్రతిష్టా మహౌత్సవాలు నేత్ర పర్వంగా సాగాయి. ఐదవ రోజు వేలాది మంది భక్తుల శివనామస్మరణ, హర..హర శంభో శంకర జయ జయ ద్వానాల నడుము ' శ్రీ అపిత కుచాంబిక సహిత అరుణాచలేశ్వరస్వామి' ద్వజ, శిఖర, కలశ ప్రతిష్టా మహౌత్సవాలను తిరుపతి నుండి వచ్చిన వేద పండితులు అత్యంత వైభోపేతంగా శాస్త్రోక్తకంగా నిర్వహించారు.
మండలంలోని నర్సాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం (చిన్న అరునాచలం)లో ఈ నెల 16వ తేదీ నుండి నిర్వహిస్తున్న ద్వాదశ జ్యోతిర్లింగాలు, పరివార దేవతల ప్రతిష్గ మహౌత్సవాలు సోమవారం నాటికి ఐదవ రోజుకు చేరుకున్నాయి. చివరి రోజు సోమవారం ఆలయం ముందు రాతి ద్వజ స్థభం ప్రతిష్టాపన, శిఖరం ఏర్పాటు, కలశ ప్రతిష్టలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ వ్యవస్తాపకులు శివనాగస్వామి ఆద్వర్యంలో ఆలయ ఆవరణలో ప్రత్యేక హౌమాలు, ప్రదాన కలశ పూజలు వంటి విశేష పూజా కార్యక్రమాలు ప్రదాన ఆలయం వాటి ఉపాలయాల్లో 68 విగ్రహాల మహా ప్రతిష్టా మహౌత్సవాన్ని అత్యంత కన్నుల పండువగా నిర్వహించారు. ఉదయం 11.31నిమిషాలకు జరిగిన ద్వజస్థంభ ప్రతిష్టా మహౌత్సవం, శిఖర, కలశ ప్రతిష్ట మహౌత్సవాలను వివిద ప్రాంతాల నుండి వచ్చి భక్త జన సందోహం మద్య అత్యంత వైభోపేతంగా నిర్వహించారు. ద్వజ స్థంభ ప్రతిష్టా మహౌత్సవానికి భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఐ నల్లగట్ల వెంకటేశ్వర్లు పోలీస్, సిఆర్పిఎఫ్ సిబ్బందితో ప్రత్యేక బందో బస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు. నర్సాపురం వైద్యశాల ఆద్వర్యంలో ఉచిత వైద్యశిభిరం ఏర్పాటు చేశారు. లకీëనగరం గ్రామానికి చెందిన మండా రఘు దంపతులు ఆలయానికి వెండి శఠ గోపం వితరణగా అందజేశారు. సుమారు 3 వేల మందికి అన్నదానం అందజేశారు.
చిన్న అరుణాచలంగా వెలుగొందనున్న నర్సాపురం : ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం నిర్మాణంతో నర్సాపురం గ్రామం చిన్నఅరుణాచలంగా వెలుగొందనుందనే చెప్పవచ్చు...చిన్న అరుణాచలం పేరుతో నిర్మించిన ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంలో పెద్ద అరుణాచలం నుండి తెచ్చిన 68 విగ్రహాలతో పాటు ఆలయంలో ప్రదాన లింగం, సహస్రలింగంతో పాటు ఉపాలయాల్లో జ్యోతిర్లింగాలను ఏర్పాటు చేశారు. దీంతో పాటు అన్నపూర్ణేశ్వరి నిత్య అన్నప్రసాద నిలయం, వేద మండపం, వేద వసతి, వేద పాఠశాల, గోశాల, అరుణపుష్కరిణి, అద్దాల మండపం, కళ్యాణ మండపం, మహానంది మండపం, స్పటిక లింగం వసతులను ఏర్పాటు చేశారు. భద్రాచలం, పర్శశాలకు వెళ్లే మార్గంలో ఉన్న జ్యోతిర్లింగ క్షేత్రం నిర్మాణంతో నర్సాపురం చిన్నఅరుణాచలంగా దిన దినాభివృద్ధి చెందుతుందనే చెప్పవచ్చు.