Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సదస్సు మధ్యలో వెళ్లిపోయినా నాయకులు
నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు కాంగ్రెస్‌లో వర్గ విభేధాలు భగ్గుమన్నాయి. సోమ వారం స్థానిక పద్మశాలి భవనంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్, పోట్ల మధుసూధన్‌రావు, జిల్లా అధ్యక్షులు పోదెం వీరయ్య, చందా లింగయ్య ఆధ్వర్యంలో పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేధాలు భగ్గుమన్నాయి. సభ్యత్వం నమోదు అవగాహనా సదస్సులో కొందరు వ్యక్తులు గ్రూఫులుగా ఏర్పడడం వలన అవగాహనా సదస్సు గందరగోళంగా మారింది. ప్రోటోకాల్ ప్రకారం వేదిక మీదకు పిలవలేదని, ప్లెక్షీలలో ఫోటోలు వేయలేదని నియోజకవర్గ యువజన నాయకులు పోతురెడ్డి శ్రీనివాసరెడ్డి సదస్సులో నిలదీశారు. కొందరు అతనికి వ్యతిరేకంగా మాట్లాడుతూ గ్రూఫులుగా ఏర్పడితే పార్టీ ఎలా ముందుకు సాగుతుందని ప్రశ్నించారు. ఇదే క్రమంలో శ్రీనివాసరెడ్డి సభ్యత్వ నమోదు అవగాహనా సదస్సు నుండి బైకాట్ చేసి వెళ్లిపోయారు. కొందరు యువజన నాయకులు శ్రీనీవాసరెడ్డి జిందాబాద్ అంటూ కేకలు వేశారు. అనంతరం మణుగూరు మండల అధ్యక్షులు గోపి నియోజకవర్గంలో, మండలంలో అనుమతులు లేకుండా ఇతర నియోజకవర్గ నాయకులలు వచ్చి ప్రచారం చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ మహాబూబాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు ముందు వాగ్వాదం పెట్టుకోవడం వర్గ విభేధాలను ప్రోత్సాహించడమే అవుతుందని, పార్టీ ఎలా ముందుకు వెళ్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అశ్వాపురం మండల అధ్యక్షులు గాదె కేశవరెడ్డి, పోదెం వీరయ్యను పార్టీ విధివిధానాలు ఇంతేనా ..గ్రూపు రాజకీయాలను ప్రోత్సాహిస్తున్నారా అని ప్రశ్నించారు. దీనితో పోదెం వీరయ్యతో పాటు నాయకులందరూ పార్టీ సభ్యత్వ నమోదు అవగాహనా సదస్సు నుండి బయటకు వెళ్లిపోయారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసికట్టుగా పని చేయాలని పార్టీని ముందుకు నడిపించాలని కాంగ్రెస్ అభిమానులు కోరుకుంటున్నారు.