Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఇంటర్ విద్యార్థులకు న్యాయం
చేయాలని నిరసన ర్యాలీ
నవతెలంగాణ-మణుగూరు
ఇంటర్ విద్యార్థులను ఫస్ట్ ఇయర్ నుండి సెకండ్ ఇయర్‌కు ప్రమోట్ చేయాలని రాష్ట్ర వాప్త పిలుపులో భాగంగా జేఏసీ విద్యా సంఘాల ఆధ్వర్యంలో మణుగూరులో బంద్ నిర్వహి ంచారు. సోమవారం విద్యాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ ప్రయివేట్ కార్పొరేషన్ విద్యాసంస్థల ర్యాంకుల కోసమే బోర్డు పరీక్షలు నిర్వహించిందన్నారు. 33 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత శాతం సాధించడం దారుణమన్నారు. విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడడం జరిగిందన్నారు. వెంటనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులందరినీ పాస్ చేయాలన్నారు. ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి రామటెంకి శ్రీను, ఎన్ఎస్యుఐ నాయకులు ఎస్కె.పాష, సాగర్, రవి, రమకృష్ణ, ఆదినారాయణ, సందీప్, ప్రవీణ్, రాజబాబు, మానస, శిరీష, మౌనిక, అధిక సంఖ్యలో విద్యార్దులు పాల్గొన్నారు.
ములకలపల్లి ఇంటర్ ఫలితాల్లో నేపధ్యంలో విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు గజ్జల సందీప్ డిమాండ్ చేశారు. విద్యార్ధి సంఘాల రాష్ట్ర పిలుపులో భాగంగా జూనియర్ కళాశాలల బంద్ నేపధ్యంలో ఈ మేరకు సోమవారం తహశీల్దార్ కార్యాలయం వద్ద విద్యార్థి సంఘ నాయకులు, విద్యార్థులతో కలిసి నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు కోబోజు సంతోష్, ఎఐవైఎఫ్ నాయకులు అనుముల సాయికిరణ్, ఎస్ఎఫ్ఐ నాయకులు వంశీ, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇల్లందు : ఫెయిలైన ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం విద్యార్థి సంఘాలు చేపట్టిన బంద్ విజయవంతమైంది. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పిడిఎస్యు ఆధ్వర్యంలో జగదాంబ సెంటర్లో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పట్టణ జిల్లా నేతలు అభిమన్యు, హరీష్ గౌడ్, గణేష్, మహేష్, చంద్రశేఖర్, షాహిద్, ప్రవళిక, పూజిత, మానస, సంధ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
గుండాల : పాఠాలు చెప్పకుండా పరీక్షలు నిర్వహించడం సమంజసం కాదని ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు గంగాధరి వినరు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియేట్ విద్యాసంస్థల బంద్‌లో భాగంగా సోమవారం మండల కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బందు నిర్వహించారు. ఈ సందర్భంగా గంగాధరి వినరు మాట్లాడారు. జవ్వాజి జోషి, మొక్క సిద్దు, గడ్డం వరుణ్ తదితరులు పాల్గొన్నారు.