Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
పులుసుబొంత ప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు అన్నారు. సోమవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పినపాక నియోజకవర్గంలో పులుసుబొంత, చెక్‌డ్యాంలపై సాధ్య అసాధ్యాలుపై చర్చించడం జరిగిందన్నారు. త్వరలోనే పులుసుబొంత ప్రాజెక్టుకు శ్రీకారం చూడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ కాలువ భాస్కర్, డీఈ నాగమల్లేశ్వరరావు, ప్రసాదరరావు, జేఈఈ డి.రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.