Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డప్పు వాయించిన మంత్రి అజరు
భారీగా తరలివచ్చిన టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు
నవతెలంగాణ-రఘునాధపాలెం
రైతులకు న్యాయం జరిగే వరకూ, కేంద్రం దిగివచ్చే వరకూ కేంద్ర ప్రభుత్వంపై చావు డప్పు మోగించాలని మంత్రి పువ్వాడ అజరుకుమార్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్రం ప్రభుత్వం అవలంభిస్తున్న అనుచిత విధానాలపై తెరాస రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండల కేంద్రంలో నిరసనలు నిర్వహించారు. నిరసన కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ పాల్గొని డప్పు వాయిస్తూ ర్యాలీ చేశారు. ఆయనతో పాటు నాయకులు డప్పు వాయించారు. ఈ సందర్భంగా జరిగిన నిరసన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. కేంద్రం అవలంభించే రాష్ట్ర వ్యతిరేక విధానాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తామన్నారు. కేంద్రం వచ్చే యాసంగిలో ఉప్పుడు బియ్యం కొనమని చెప్పిన విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలన్నారు. అనంతరం కేంద్రప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో డీసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అజ్మీర వీరు నాయక్, మంచుకొండ సొసైటీ చైర్మన్ మందడపు సుధాకర్, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, మద్దినేని వెంకటరమణ, మండల సర్పంచ్ సంఘం అధ్యక్షులు మధం శెట్టి హరిప్రసాద్, జెడ్పీటిసి మాలోతు ప్రియాంక, ఎంపీపీ భూక్య గౌరి, మండలం సర్పంచులు, ఎంపీటీసీ,లు తదితరులు పాల్గొన్నారు.
తల్లాడ : ఉత్తర భారతదేశానికో న్యాయం, మనకో న్యాయమా, వానాకాలం పంటలు ఎన్ని మెట్రిక్ టన్నుల కొంటారు, యాసంగి లో ఎన్ని ధాన్యం కొంటారు స్పష్టం చేయాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ తల్లాడ లో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. నల్ల టీ షర్ట్లు, నల్లబ్యాడ్జీలు ధరించి, ధాన్యం బస్తాలను తలపై ఉంచుకుని, ఎడ్ల బండ్లపై కేంద్ర బీజేపీ ప్రభుత్వం దిష్టిబొమ్మను, శవయాత్ర నిర్వహించి, రింగ్ రోడ్డు సెంటర్లో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
మండల పరిధిలోని రామానుజవరం సర్పంచ్ శీలం కోటారెడ్డి ఆధ్వర్యంలో వందమంది రైతులు నల్ల టీ షర్టులు ధరించి, ద్విచక్రవాహనాలపై తల్లాడలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.
బీజేపీకి చావు డప్పు మోగిస్తాం.. పాడె కట్టి వూరేగిస్తాం
వైరా : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయటానికి నిరాకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టటానికి కుట్రతో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణా లో చావు డప్పు మ్రోగించి పాడె కట్టి ఊరేగిస్తామని వైరా ఎమ్మెల్యే లావు డ్యా రాములు నాయక్ అన్నారు. వైరాలో కేంద్రానికి నిరసనగా నల్ల జెండాలతో చావు డప్పులతో ప్రదర్శన నిర్వహించారు. క్రాస్ రోడ్డులో రాస్తారోకో నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్దం చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమం లో ఎమ్మెల్యే మాట్లాడారు. దేశంలో రైతులను పెట్టుబడి దారుల చేతిలో పావులుగా మార్చాలన్న కుతిలనీతిని రైతులు పోరాడి విజయం సాధించారని కాని మోడీ గుణపాఠం నేర్వలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మునిసిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, ఎంపీపీ వేల్పుల పావని, జడ్పిటిసి నంబూరి కనకదుర్గ, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మా రోశయ్య, మునిసిపల్ వైస్ చైర్మన్ మల్లపాటి సీతారాములు, రైతు బంధు మండల కన్వీనర్ మిట్టపల్లి నాగి, మాజీ ఎంపీపీ కట్టా కృష్ణార్జున రావు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు పసుపులేటి మోహన్ రావు, మునిసిపల్ కౌన్సిలర్స్, తదితరులు పాల్గొన్నారు.
కల్లూరు : తెలంగాణ రైతాంగం పండించిన ధాన్యం పంట కొనుగోలు పట్ల కేంద్ర బిజె.పి ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై సత్తుపల్లి శాసన సభ్యులు సండ్ర వెంకట వీరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దహనం చేశారు. కల్లూరు ప్రధాన సెంటర్లో ప్రదర్శన నిర్వహించి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. నల్ల చొక్కా, బ్యాడ్జీలతో, ప్లకార్డులతో వచ్చి కేంద్ర బిజెపి ప్రభుత్వ దిష్టిబొమ్మను శవయాత్రగా ర్యాలీ నిర్వహించి డప్పు కొట్టి కల్లూరు సెంటర్ నందు దిష్టి బొమ్మను తగలబెట్టి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కట్టా అజరుకుమార్, రైతు సమితి జిల్లా మండల ప్రతినిధులు పసుమర్తి చందర్రావు, లక్కినేని రఘు, డీసీసీబీ డైరెక్టర్ బోబోలు లక్ష్మణ్‌రావు, మేకల కృష్ణ, గోపాలస్వామి, పి.రామకృష్ణ్ణ పాల్గొన్నారు.
ఖమ్మం రూరల్ : ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండివైఖరి విడనాడాలని పాలేరు యంయల్ఏ కందాళ ఉపేందర్ రెడ్డి అన్నారు. ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టిఆర్ఎస్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని నాయుడు పేట వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి కందాళ మాట్లాడారు. అనంతరం రాస్తారోకో నిర్వహించి ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండలాధ్యక్షుడు బెల్లం వేణు, ఎంపీపీ బెల్లం ఉమ, జడ్పీటీసీ యడ్లపల్లి వరప్రసాద్, సుడా డైరెక్టర్ గూడా సంజీవ రెడ్డి, గుడిబోయిన దర్గయ్య, ముత్యం కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.