Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-మల్టీపర్పర్స్ విధానం రద్దు చేయాలని
- ప్రదర్శన ఖమ్మం డిపిఓ ఆఫీస్ ముట్టడి
- ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్టీయూ జేఏసీ
నవతెలంగాణ-ఖమ్మం
గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని మల్టీపర్పస్ విధానం రద్దు చేసి కార్మికులను నాల్గొవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని సీఐటియు జిల్లా అధ్యక్షులు తుమ్మా విష్ణువర్ధన్, ఏఐటీయుసీ రాష్ట్ర కార్యదర్శి సింగు నర్సింహారావు, తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయుసి) జిల్లా ఇన్చార్జి మందా వెంకటేశ్వర్లు, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి జి.రామయ్య డిమాండ్ చేశారు. సోమవారం ఏఐటీయుసీ, సీఐటియు, ఐఎఫ్టీయు గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఖమ్మం పంచాయతీ అధికారి కార్యాలయం (డీపీఓ) ఆఫీస్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. కార్యాలయంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం బందోబస్తు మధ్య ఇన్చార్జి డీపీఓ వి.అప్పారావు కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయితీ సిబ్బంది వేతనాల పెంచాలని పిఆర్సి తరహా నిర్ణయాత్మక ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మికులకు మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని కోరారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 12,765 గ్రామ పంచాయతీల్లో సుమారు 36,000 మంది సిబ్బంది పారిశుధ్యం, నర్సరీలు, వాటర్ సప్లై, వీధి దీపాల నిర్వహణ, పన్నులు వసూలు చేయడం, ఆఫీసు నిర్వహణ తదితర పనుల్లో వివిధ కేటగిరీల సిబ్బంది పనిచేస్తున్నారని వీరికి 2019 అక్టోబర్‌లో జీఓ నెం. 51ని విడుదల చేసి వేతనాలను రూ.8,500లుగా నిర్ణయించి అమలుచేస్తున్నారని అన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 500 మంది జనాభాకు ఒక కార్మికుడు చొప్పున ఖరారు చేస్తే ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులు 2021లో ఉన్న జనాభాకు సేవలందిస్తున్నారని 2021 జనాభా లెక్కలను పరిగణిస్తే అనేక సంవత్సారాలుగా పనిచేస్తున్న పంచాయతీ కార్మికులు ఈ పరిధిలో నుండి మినహాయించబడుతున్నా
రని అన్నారు. గతంలో ప్రభుత్వం నిర్ణయించిన రూ.8,500లు వేతనం నేటికీ అనేక మందికి అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయితీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, నర్సరీ కార్మికులు, ట్రాక్టర్ డ్రైవర్లు, వాటర్ సప్లై కార్మికులు, వీధి దీపాల నిర్వహణ కార్మికులు, ఆఫీసు నిర్వహణ సిబ్బంది, కారోబార్, బిల్ కలెక్టర్లకు జీవో నెం:60లో పేర్కొన్న కేటగిరీల వారీగా వేతనాలు పెంచాలని ఖాళీగా ఉన్న పోస్టులలో ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కారోబార్, బిల్ కలెక్టర్లకు స్పెషల్ స్టేటస్ కల్పించాలని. వారికి పంచాయితీ అసిస్టెంట్‌గా నామకరణం వేతనాలు పెంచాలన్నారు. మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. పాత కేటగిరీలలోనే కొనసాగించాలని పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ప్రకటించిన ఎస్కడే పేరిట రూ.2 లక్షలలు ఇన్సూరెన్స్ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణ, ప్రమాదాల్లో మరణించిన సిబ్బంది కుటుంబానికి రూ.10 లక్షలుణ నష్టపరిహారాన్ని ప్రభుత్వమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయుసి జిల్లా ఉపాధ్యక్షు
రాలు సి.హెచ్ సీతామహాలక్ష్మి, గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పిట్టల మల్లయ్య, సిఐటియు గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పెరుమాళ్ళ మోహన్ రావు, ఐఎఫ్టియు గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి రాందాస్, ఐఎఫ్టియు నాయకులు ఆడెపు రామారావు, పంచాయతీ వర్కర్స్ యూనియన్ల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు రాజగోపాల్, రాందాస్ పాల్గొన్నారు.