Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మోడీ కేసీఆర్ ఒకే తాను ముక్కలు
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య
నవతెలంగాణ-అశ్వారావుపేట
వచ్చే నెల 4, 5 తేదీల్లో అశ్వారావుపేటలో జరగబోయే సిపిఐ(ఎం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 2వ మహాసభలు విజయవంతానికి విస్త్తృత ప్రచారం నిర్వహించాలని పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక ప్రజాసంఘాల కార్యాలయం అయిన సుందరయ్య భవన్లో మండల కమిటీ సభ్యులు మడిపల్లి వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు అయిన మండల కమిటీ సభ్యులు, శాఖా కార్యదర్శుల సమావేశంలో కనకయ్య జిల్లా మహాసభల ఏర్పాట్లు, ప్రచారం, సభ్యత్వం పునరుద్ధరణపై సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఈ ప్రాంతం పార్టీ నిర్వహించిన పోరాటాలు, ప్రజలకు అండగా నిలిచి సాధించిన విజయాలు, పోడు సాగుదారుల పక్షాన నిలిచిన నాయకులపై పెట్టిన కేసులు దృష్ట్యా ఈ మహాసభలు ప్రాధాన్యత సంతరించుకున్నాయని అన్నారు. పార్టీ ప్రతిష్టకు తగ్గట్టుగా భవిష్యత్ కార్యాచరణను ఈ మహాసభలలో రూపొందించే అవకాశం ఉన్నందున ప్రతీ కార్యకర్త ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలు నుండి మరలచడానికే మోడీ, కేసీఆర్ లు రాజకీయ డ్రామాకు తెరదించారని అభిప్రాయపడ్డారు. వీరిద్దరూ రాజకీయంగా ఒక తాను ముక్కలేనని ఎద్దేవా చేసారు.పెట్టుబడి దారి బూర్జువా వైఫల్యాలకు మార్క్సిజమే ప్రత్యామ్నాయ విధానం అని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య, జిల్లా కమిటీ సభ్యులు పిట్టల అర్జున్, మండల కన్వీనర్ బుడితి చిరంజీవి నాయుడు, దమ్మపేట మండల కార్యదర్శి మోరంపుడి శ్రీనివాసరావు, నాయకులు దొడ్డా లక్ష్మినారాయణ, గడ్డం సత్యనారాయణ, దానపు మునియ్య పాల్గొన్నారు.