Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
పట్టణంలోని మార్గదర్శిని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బుధవారం ప్లాస్టిక్ నివారణ, విపత్తులు ఎదుర్కోనే అంశంపై విద్యార్థులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్రెడ్డి హాజరై ప్రసంగించారు. అనంతరం విద్యార్థులకు డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. స్వచ్ఛభారత్ స్వచ్ఛ సర్వేక్షన్, ఎపడమిక్ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తుల నిర్వహణ కార్యక్రమంలో భాగంగా జరిగిన కార్యక్రమంలో మార్గదర్శి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ప్రిన్సిపాల్ అర్వపల్లి రాధాకృష్ణ, సానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఆతాహార్ పాల్గొన్నారు.