Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఫిభ్రవరి 23, 24 తేదీలలో జాతీయ సమ్మె
అ సీఐటియు రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి ఎం.సాయిబాబు
నవతెలంగాణ-కొత్తగూడెం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ 2022 ఫిబ్రవరి 23, 24 తేదీలలో 2 రోజులలో జరిగే జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.సాయిబాబు పిలుపు నిచ్చారు. బుధవారం స్థానిక సిఐటియూ కార్యాలయంలో సిఐటియు జిల్లా ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బిజెపి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటకరించే చర్యలను సమ్మె ద్వారా ప్రతిఘటిస్తామన్నారు.దేశఆర్దిక వ్యవస్ధను బలహీన పరుస్తున్న ఆర్ధిక విధానాలను అన్నీవర్గాల ప్రజలు వ్యతిరేకించాలని కోరారు. రైతు పోరాటం మోదీ ప్రభుత్వం మెడలు వంచి సాధించిన విజయం స్పూర్తితో లేబర్ కోడ్లు రద్ధు కోసం సమరశీల పోరాటాలు చేస్తామని తెలిపారు. నేషనల్ మానిటైజేషన్ పైపులైన్ పేరుతో ప్రజా సంపదను కార్పొరేట్ కంపెనీలకు దోచి పెట్టే చర్యల వలన దేశభవిష్యత్ ప్రమాదంలోకి నెట్టి వేయబడుతుందని విమర్శించారు. దేశ ప్రజల వ్యతిరేకమైన విధానాలను అమలు చేసుకుంటూ పైకి దేశభక్తి మాటలు వల్లించినట్లు బిజెపి పాలన సాగుతుందని సిఐటియు విమర్శించింది. విధ్యుత్ చట్టం సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పిభ్రవరి 1 జరిగే దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమ్మెను ప్రజలంతా బలపరచాలని విజ్ఞప్తి చేశారు. పేదలకు సేవలందిస్తున్న ఐసిడిఎస్, ఆషా, మిడ్డే మిల్స్ వంటి స్కీమ్లని పటిష్టంగా అమలు చేయాలని స్కీమ్ వర్కర్లకు కనీసవేతనం రూ.21,000 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశాని సిఐటియు జిల్లా అద్యక్షులు యంవి.అప్పారావు అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి ఎజె.రమేష్ నాయకులు జి.పద్మ, కె.బ్రహ్మాచారి, కొండపల్లి శ్రీదర్, గద్దల శ్రీను, వెంకటమ్మ, జి.రాజు, యర్రగాని కృష్ణయ్య వెంకటరామారావు సయ్యద్ నభి, డి.వీరన్న, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.