Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఐకమత్యంగా ఉంటేనే విజయం సాధిస్తాం
అ ఎంఎల్సీ తాతా మధుసూధన్
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల నూతన ఎమ్మెల్సీ తాతా మధు సూదన్ అన్నారు. బుధవారం భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న అనంతరం భద్రాచలం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పార్టీ కార్యాలయం లోకి రాగానే టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పూలవర్షంతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్ట సభలో ప్రవేశించడానికి అవకాశం కల్పించిన తెలంగాణ స్ఫూర్తి ప్రదాత, రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్కి, విజయం సాధిస్తావని భరోసా ఇచ్చిన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కి, నా విజయానికి కృషి చేసిన రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజరు కుమార్ కు, మహ-బాద్ ఎంపీ మాలోత్ కవితకి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డికి, పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలకు, గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా భద్రాచలం నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిథులకు ప్రత్యేక కృతజ్ఞతలను ఆయన తెలిపారు. మనం ఐకమత్యంగా ఉంటేనే విజయం సాధిస్తామని, గ్రూపు రాజకీయాలు వద్దేవద్దని ఆయన అన్నారు. కార్యకర్తలు, నాయకుల మధ్య ఐకమత్యం పెంచేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. ప్రస్తుతం పోడు భూముల సమస్య, ఏపీలో విలీనమైన ఐదు గ్రామ పంచాయతీల సమస్య, రామాలయం అభివృద్ధి, మూడు సమస్యలు ఉన్నాయని వీటికి త్వరలోనే పరిష్కారం లభిస్తుం దన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు, టీఆర్ఎస్ భద్రాచలం మండల అధ్యక్ష, కార్యదర్శులు అరికెల్ల తిరుపతి రావు, కొండిశెట్టి కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులు రత్నం రమాకాంత్, నర్రా రాము, చింతాడి చిట్టి బాబు, బీసీ సెల్ అధ్యక్షులు రామకృష్ణ అధికార ప్రతినిధి బి. రాంబాబు సీనియర్ నాయకులు తిప్పన సిద్దులు, కోటగిరి ప్రభోద్ కుమార్, తాళ్ల రవికుమార్, ఏజీపీ పడిశిరి శ్రీనివాస్, ఆర్టీఏ డైరక్టర్ గూడపాటి శ్రీను, దిశ కమిటీ మెంబర్ లకావత్ వెంకటేశ్వర్లు, 1వ వార్డు కమిటీ అధ్యక్షులు మామిళ్ల రాంబాబు, కార్మిక సంఘం అధ్యక్షులు చుక్కా సుధాకర్, దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.