Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద పరిశ్రమ సింగరేణి. బొగ్గు గనులకు పుట్టినిల్లు బొగ్గుట్ట(ఇల్లందు) 132 సంవత్సరాలకుపైగా చరిత్ర. సింగరేణి వ్యాప్తింగా ఒకప్పుడు 55 అండర్ గ్రైండ్, 25 ఓసీలు లక్షకు పైగా కార్మికులు ఉండేవారు. ప్రస్తుతం 29 అండర్ గ్రౌండ్,19 ఓసిలు,43వేల మంది కార్మికులు ఉన్నారు. ఇల్లందు కోయగూడెం ఓసిలలో ప్రస్తుతం 763 మంది కార్మికులు ఉన్నారు. ఒకప్పుడు 20 వేల మంది కార్మికులతో లక్షమందికిపైగా జనాభా. నాడు కళకళలాడి నేడు వెలవెలబోతోంది.
50 ఏండ్లపాటు ఏడు అండర్‌గ్రౌడ్ మైన్స్, రెండు ఓపెన్‌కాస్ట్‌లు వాటి సంబంధిత డిపార్టుమెంట్లతో 16 వేల మంది కార్మికులతో కళకళలాడింది. వారిపై పరోక్షంగా ఆధారపడిన వ్యాపారస్తులు, ఉద్యోగులు, ప్రభుత్వ, ప్రయివేటు రంగ సంస్థలు ఉద్యోగులు, కార్మికులు మొత్తంగా లక్షకుపైగా జనాభా. ఇది ఒకప్పటిమాట.
సంస్కరణల నేపథ్యంలో బొగ్గునిక్షేపాలు అంతరించాయనే నెపంతో ఒక్కొక్క మైన్‌ను మూసివేస్తు వచ్చింది సింగరేణి యాజమాన్యం. సంస్ధ నిర్ణయాలకు తలూపాయి నాటి నేటి గుర్తింపు సంఘాలు. బ్రిటీష్ కాలంల నాటి ఒకే ఒక్క భూగర్భగని అనధికారికంగా మూత పడి రెండేళ్ళు. జెకే ఓసి కారేపల్లి మండలం ఖమ్మం జిల్లాలోకి వెళ్ళింది. సాంకేతికంగా చూస్తే బొగ్గుట్ట (ఇల్లందు) మండలంలో భూగర్భగనులు, ఓసిలు అంటూ ఏమి లేవు. టేకులపల్లి మండలం కోయగూడెంలో ఓసి నడుస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కోయగూడెం 3 బ్లాక్ కార్పొరేట్‌కు కట్టబెట్టడానికి టెండర్లు పిలిచింది. ఎవరూ ముందుకు రాకపోవడంతో నిలిలిచింది. ఇల్లందులో మిగిలింది జిఎం కార్యాలయం ఒక్కటే. నాటి ప్రభావాన్ని కోల్పోయి దీనావస్దగా దర్శనమిస్తోంది. ప్రస్తుతం ఇల్లందు మనుగడ ప్రశ్నార్ధకం.
అటకెక్కిన సిఎం కేసిఆర్ ఎన్నికల హామీలు
2014, 2018 సార్వత్రిక ఎన్నికల ప్రచారాలు, గుర్తింపు సంఘ ఎన్నికలు, సీతారామ ప్రాజెక్టు శంకుస్ధానలు తదితర సందర్భాల్లో సీిఎం కేసిఆర్ ఇల్లందులో పర్యటించారు. సింగరేణి ఉన్నత పాఠశాల ఆటస్ధలంలో జరిగిన భారీ బహిరంగ సభల్లో హామీలు గుప్పించారు. ఇల్లందు చరిత్ర తెలుసున్నారు. పూర్వ వైభవం తెస్తానన్నారు. చరిత్రను నిలబెడతామన్నారు. పర్యావరణానికి హానికరంగా ఉన్న ఓసీలు రద్దు చేసి ఇల్లందు, గుండాలలో భూగర్భ గనులు తెస్తామన్నారు. బ్రిటీష్ కాలం నాటి భూగర్భ గనులను చారిత్రకంగా నిలిచేలా తీర్చిదిద్ది సందర్శన స్ధలాలుగా తీర్చిదిద్దుతామన్నారు. రద్దైన ప్యాసింజర్ రైలు నడిపిస్తామన్నారు. బస్‌డిపో తదితర ముఖ్యమైన అంశాలపై అధికారులకు ఆదేశాలు ఇస్తామన్నారు. ఇలా ఎన్నో హామీలు గుప్పించారు. దీంతో ప్రజలు కరతాళద్వనులతో సంతోషం వ్యక్తం చేశారు. హామీలు ఇచ్చి ఎనిమిదేళ్ళు అయినా ఒక్క హామీ అమలు కాలేదు.
మైన్ జీవితకాలం పెంచి, పాత, కొత్త బావులు పునప్రారంభిస్తేనే మనుగడ
ప్రస్తుతం 21 భూగర్భ గనిలో 27 ప్యానెల్(ఇండెక్స్) 9వ ప్యానెల్(బాటం సెక్షన్)లో బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. ఈ నిక్షేపాలు వెలికితీస్తే కనీసం మరో 4 సంవత్సరాలు మైన్ నడవడానికి అవకాశం ఉంటుంది. సింగరేణి వ్యాప్తింగా 43 వేల మంది కార్మికులు పనిచేస్తుండగా 12 వేల మంది ఎక్స్‌సెస్ ఉన్నారని యాజమాన్యమే అంటోంది. అలాంటప్పుడు వారిని ఇల్లందుకు బదిలీ చేసుకోవచ్చని కార్మిక సంఘాలంటున్నాయి. ముకుందా రెడ్డి జిఎం ఉన్న కాలంలో 20 ఫిట్ మైన్ నడపడానికి ప్రయత్నించారు. తక్కువ సీం ఉందని ఫిల్లింగ్ ఇబ్బందని మైన్ మూసివేశారు. నూతన టెక్నాలజీ ప్రకారం మైన్ మళ్ళీ తెరవచ్చని నిపుణులు, సీనియర్ కార్మికులంటున్నారు. తక్కువ సీం ఉన్న లేపవచ్చు. భూగర్భగనుల్లో కొత్తగా ఎస్డిఎల్సిలు వచ్చాయి. వీటితో కోల్ తీయవచ్చు. ఈ మైన్ తెరిస్తే 15 సంవత్సరాలు జీవత కాలం ఉంటుంది. దీంతోపాటుగా గుండాలలో భూగర్భగనులకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నూతన బావుల ఏర్పాటుకు పూనుకోవాలి. ఇల్లందులో స్టాండర్డ్ తునికాకు లభిస్తోంది. బీడి పరిశ్రమ, మొండితోగులో విలువైన గ్రానైట్స్ నిల్వలు ఉన్నాయి. టేకులపల్లిని తడికలపూడిలో అబ్రకం నిల్వలు ఉన్నాయి. వీటిని వెలికి తీసి పరిశ్రమలు నెలకొల్పవచ్చు. గిరిజన యూనివర్శిటీ, గాంధీనగర్-ఇల్లందు 10 కిమీ.రైల్వే లైన్ ఏర్పాటు చేయాలి. ఈ దిశగా ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుంటేనే ఇల్లందుకు మనుగడ.
సిఎం కేసిఆర్ హామీలు నెరవేర్చాలి : సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా నర్సింహారావు
గత ఎన్నికల సందర్బంగా సిఎం కేసిఆర్ ఇల్లందుకు వచ్చి బొగ్గుట్ట మనుగడకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. ఇల్లందు, గుండాలలో భూగర్భగనులు తీయాలి. టేకులపల్లిలోని కోయగూడెం ఓసి 3 బ్లాక్ కార్పోరేట్ శక్తుల పరం కాకుండా సింగరేణి ఆధీనంలోనే నడిచేట్టు చర్యలు తీసుకోవాలి. ఇల్లందు భవిషత్తు కాపాడాలి.
సింగరేణి ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలి : టీబీజికెఎస్ డివిజన్ ఉపాద్యక్షులు రంగనాథ్
కార్మికులకు సంగరేణి డే శుభాకంక్షలు. కొత్త ఓసిలు, భూగర్భగనుల వెలికి తీత, కొత్త ప్రాజెక్టులపై యాజమాన్యం చొరవ చూపాలి. బొగ్గుట్టకు పూర్వవైభం తేవాలి. సింగరేణి ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తే ఇల్లందుకు గుర్తింపు వస్తుంది.