Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మధిర
మధిర మండలం మల్లవరం గ్రామంలోని మిర్చి తోటలను సీపీఐ(ఎం) బృందం బుధవారం పరిశీలించింది. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాదినేని రమేష్ డిమాండ్ చేశారు.కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి మందా సైదులు, మల్లారం గ్రామ సర్పంచ్ మందడపు ఉపేంద్ర, గ్రామ నాయకులు కొంగర విశ్వేశ్వరరావు, నాగులు మీరా, రైతులు రమేష్, మందడపు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.