Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కల్లూరు
పట్టణంలో నూతనంగా నిర్మించిన లక్ష్మీ సినీ స్క్వేర్ ఏసీ థియేటర్‌ను బుధవారం ఎంఎల్ఏ సండ్ర వెంకటవీరయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ కల్లూరు మండల పరిసర ప్రాంత ప్రజానీకానికి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని అందించే విధంగా సినిమా, జిమ్, ఫుడ్ కోర్టు అన్ని సౌకర్యాలతో మినీ థియేటర్ నిర్మించడం అభినందనీయమన్నారు. యాజమాన్యం అయిన మందపాటి రాజమోహన్‌రెడ్డి, సురేష్‌రెడ్డి, మాధవరెడ్డిలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టీఆర్ఎస్ జిల్లా నాయకులు మట్టా దయనంద్, డీసీసీబీ మువ్వ .విజయబాబు, కోర్లగూడెం సొసైటీ చైర్మన్ కీసర వెంకటేశ్వరరెడ్డి పాల్గొని థియేటర్‌ను సందర్శించారు. కార్యక్రమంలో గోవా ఓఎస్డీ సాయిరతన్, చెరువైన దూరమైన చిత్రం ఫేమ్ వర్ధమాన సినీ హీరో సుజిత్, రైతు సమితి ప్రతినిధులు డా,, లక్కినేని రఘు, పసుమర్తి చంద్రరావు, మాజీ ఎంపీపీ అత్తూనూరి రంగారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ బోబోలు లక్ష్మణరావు, ఎఎంసి వైస్ చైర్మన్ కాటంనేని వెంకటేశ్వరరావు, కాటేపల్లి కిరణ్, సర్పంచ్ నందిగం ప్రసాద్, టిఆర్ఎస్ మండల సెక్రెటరీ కొరకొప్పు ప్రసాద్, నాయకులు కర్నాటి జయబాబురెడ్డి, మేకల కృష్ణ, కర్నాటి అశోక్ రెడ్డి, ఉబ్బన వెంకటరత్నం, రాచమళ్ల నాగేశ్వరరావు, సోషల్ మీడియా ప్రతినిదులు సిహెచ్.కిరణ్, ఏనుగుల అంజి, ఖమ్మంపాటి పుల్లారావు, బైర్ల కాంతారావు తదితరులు పాల్గొన్నారు.