Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరుమలాయపాలెం
వద్ధాప్య వికలాంగు వితంతు ఒంటరి మహిళ పింఛన్లకు దరఖాస్తు పెట్టుకున్న వారందరికీ వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఎంపీడీవో బాణోత్ జయరాంకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను మాట్లాడుతూ మండలంలో అనేకమంది పేదలు పింఛన్ల కొరకు దరఖాస్తులు పెట్టుకొని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 57 ఏళ్లు నిండిన పేదలందరికీ పెన్షన్లు ఇస్తామని చెప్పిన కేసీఆర్ మాటలు నీటి మూటలుగా మిగిలాయని తెలిపారు. పింఛన్ల సాధనకై గ్రామస్థాయి నుండి పోరాటాలకు రూపకల్పన చేస్తామని తెలిపారు. లబ్దిదారులతో సిపిఎం ఆధ్వర్యంలో ఎంపిడివో కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు అంగిరేకుల నరసయ్య, దోనెపల్లి వెంకన్న, మండల కమిటీ సభ్యులు దాసరి మహేందర్, నాయకులు బచ్చలకూర రాములు, వెంకటేష్, దాసరి భద్రయ్య, ఏపూరి లింగయ్య పాల్గొన్నారు.