Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సత్తుపల్లి
రానున్న సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సత్తుపల్లి పట్టణంలో ఐద్వా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మహిళలకు పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆ సంఘ జిల్లా నాయకురాలు పాకలపాటి ఝాన్సీ తెలిపారు. బుధవారం స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో ఐద్వా పట్టణ నాయకులు తిగుళ్ల లకీë అధ్యక్షతన నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. జనవరి 2వ తేదీ నుంచి సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల మహిళలకు ముగ్గుల పోటీలు, పలు ఆటల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. మహిళలలో సృజనాత్మకతను వెలికితీసేందుకు, వారిలో ఐక్యతను పెంచి వారితో మమైకమయ్యేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. పట్టణంలోని మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. సమావేశంలో ఐద్వా నాయకులు కుమారి, శారద, కవిత, కాంచన, పద్మ, పుష్ప, మహేశ్వరీ, లత పాల్గొన్నారు.