Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జెడ్పీటీసీ, ఎంపీపీ కొమరం హనుమంతరావు, కోండ్రు మంజు భార్గవి
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం క్రిస్మస్ పండుగ చిరుకానుకగా 80 మంది నిరుపేద క్రైస్తవులకు నూతన దుస్తులు అందించినట్టు స్థానిక జెడ్పీటీసీ, ఎంపీపీ కొమరం హనుమంతరావు, కోండ్రు మంజు భార్గవి అన్నారు. ఈ మేరకు బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో స్థానిక తహశీల్దార్ మొహమ్మద్ సాదీయా సుల్తానా అధ్యక్షతన దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని మతాల ప్రజలను కేసీఆర్ ప్రభుత్వం సమానంగా, పారదర్శకంగా పరిపాలిస్తుందన్నారు. మండలంలోని ఆయా చర్చీల వద్ద కనీస సౌకర్యాలు కల్పించేందుకు సర్వదా కృషి చేస్తామని చెప్పారు. క్రైస్తవులకు శ్మశాన వాటికలకి ఆళ్ళపల్లి, మర్కోడు గ్రామాల్లో ప్రభుత్వ స్థలం ఇవ్వాలని స్థానిక వైస్ ఎంపీపీ రేసు ఎల్లయ్య కోరగా, మీ సమస్యను లిఖిత పూర్వకంగా ఇవ్వండి విషయం కలెక్టర్ దృష్ట్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తహసీల్దార్ సాదియా సుల్తానా పేర్కొన్నారు. అనంతరం జెడ్పీటీసీ, ఎంపీపీలు కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర, సోదరీమణులకు ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపిడిఓ ఎం.మంగమ్మ, వైద్యాధికారి సాగర్, ఆర్.ఐ.లు సోయం సమ్మయ్య, బుల్లిరామ్, వీఆర్వో నందు, తదితరులు పాల్గొన్నారు.