Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
ఖమ్మం నూతన బస్టాండ్ నుంచి ఎన్ఎస్పి క్యాంపుకు వచ్చే రోడ్ మూలమలపు వద్ద వున్న సైడ్ డ్రైనేజీ అత్యంత ప్రమాదకరంగా ఉందని, వెంటనే టిఆర్ఎస్ పాలకవర్గం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.విక్రమ్ డిమాండ్ చేశారు. బుధవారం సిపిఎం ఖమ్మం టూ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో నాయకులు డ్రైనేజీను పరిశీలించారు. ఈ సందర్భంగా వై విక్రమ్ మాట్లాడుతూ బైపాస్ రోడ్డులో నూతన బస్టాండ్ రావడంతో ఎన్ఎస్పి క్యాంపు రహదారి మీదు ట్రాఫిక్ బాగా పెరిగిందని, దీంతో డ్రైనేజీ వద్ద పలుసార్లు టూ వీలర్ వాహనదారులు ప్రమాదానికి గురువయ్యారని తెలిపారు. బైపాస్ బంకు వద్ద వున్న ఈ సైడ్ డ్రైనేజీ బాగా లోతుగా ఉండటం వల్ల అత్యంత ప్రమాదకరంగా ఉన్నదన్నారు. సదరు కాంట్రాక్టర్, అధికారులు నిర్లక్ష్యం వల్లనే ఈ ఇబ్బందులు తలెత్తుతాయని ఆరోపించారు. కార్పొరేటర్లు కూడా రహదారుల డ్రైనేజీ నాణ్యతలపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ టూ టౌన్ కార్యదర్శి బోడపట్ల సుదర్శన్, జె.వెంకన్న బాబు, కె.వెంకన్న, పి.వాసు, ఎస్.రవీంద్రర్, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు