Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మం పట్టణానికి చెందిన ఆనం ఆస్రితారెడ్డిలను హైదరాబాద్ రవీంద్రభారతిలో ఘనంగా సత్కరించారు. శ్రీశ్రీ కళా వేదిక తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ సాహిత్య సదస్సు శతాధిక కవి సమ్మేళనం కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లోని తెలుగు కవులు కవయిత్రలు పాల్గొన్నారు. సభలో శతాధిక కవి సమ్మేళనంలో వారు తమ కవితలను ఆలపించారు. ఈ సందర్భంగా శ్రీశ్రీ కళా వేదిక చైర్మెన్ ప్రభుత్వ జాషువా కవి పుష్కర గ్రహిత డాక్టర్ కత్తిమండ ప్రతాప్, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ పిల్లంగొల్లి లక్ష్మీలు పూలదండలతో శాలువాలు కప్పి మెమోంటాలు, ప్రశంసాపత్రాలను అందజేశారు. భీమన్న సాహిత్య నిధి ట్రస్టు చైర్ పర్సన్ బోయి హైమావతి భీమన్న, శ్రీశ్రీ కళావేదిక జాషువా కార్యవర్గ సభ్యులు కొల్లి రమావతి, చిడే లలిత,. రిషి తణుకు, ఇండ్ల సంధ్య, అనం ఆశ్రీతారెడ్డిలు పాల్గొన్నారు.