Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెప్టిక్ ట్యాంక్‌ను జియో ట్యాగింగ్ చేయుటకు సహకరించాలి
- సమావేశంలో మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి
నవతెలంగాణ-ఇల్లందు
పట్టణంలో ప్లాస్టిక్ కవర్లను నివారించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, కమిషనర్ అంజన్ కుమార్ తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఫంక్షన్ లలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసి స్టీల్ సామాన్లతో ప్లాస్టిక్ గ్లాసులు ప్లేట్లు వాడుకలోకి తేవాలని తెలిపారు. ప్లాంట్ మెప్మా వారి ఆధీనంలో ఉండే విధంగా చూడాలని తెలిపారు. అదేవిధంగా స్వచ్ఛ సర్వేక్షన్ 2022లో భాగంగా 15 శాతం వార్డులలో ఇళ్లలో వచ్చే తడి చెత్తను హౌం కంపోస్టింగ్ చేసే ప్రక్రియను ప్రారంభించాలని తెలిపారు. ఎలా చేయాలనేది వారికి తెలిసే విధంగా మెప్మా రిసోర్స్ పర్సన్స్ బాధ్యత తీసుకోవాలని తెలిపారు. ఇళ్ళలో గల వ్యక్తిగత టాయిలెట్ కు సంబంధించిన సెప్టిక్ ట్యాంక్ ను జియో ట్యాగింగ్ చేయుటకు సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్ రెడ్డి, యశోద, నాగమణి ఆర్పిలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.