Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- టేకులపల్లి
టేకులపల్లి రేంజి పరిధిలోని అటవీ అభివృద్ధి పనులను బుధవారం సర్కిల్ కన్సైర్వేటర్ ఆప్ ఫారెస్ట్ డి.బీమా, అటవీశాఖ అధికారి లక్ష్మణ్ రంజిత్ నాయక్, కొత్తగూడెం డివిజన్ అధికారి ఎ.అప్పయ్య, టేకులపల్లి రేంజ్ అధికారి ఎండి ముక్తార్ హుస్సేన్లు తనిఖీ చేశారు. అభివృద్ధి పనుల్లో భాగంగా ఏఎన్ఆర్, గ్లాస్ ల్యాండ్స్, పరేకు లెసన్ ట్యాంక్, ఆర్ఎఫ్డి, ప్లాంటేషన్ పనులను పరిశీలించారు. జంగాలపల్లి, జంగిల్ క్యాంపు ఏరియాను సందర్శించారు. వాగుల వెంట వెదురు మొక్కలు నాటుట గురించి, అడవుల్లో నిప్పు పడకుండా జాగ్రత్తల గురించి, వన్యప్రాణుల నీటి వసతుల గురించి ఏర్పాటు చేయమని సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ అధికారి బి.కృష్ణ, ఎం మోహన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.