Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
సిరుల తల్లి సింగరేణికి 133వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసినట్లు, ఇప్పటికే సింగరేణి డే ఏర్పాట్లు పూర్తి చేశామని, ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు, ఈ సెంట్రల్ ఫంక్షన్‌కు సంస్థ చైర్మెన్ ఎన్.శ్రీధర్ హాజరు కానున్నట్లు, ఉదయం ఉత్సవాల స్టాల్స్ చైర్మెన్ ప్రారంభిస్తారని, సాయంత్రం 6 గంటల నుండి సాంస్కతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు సింగరేణి డైరెక్టర్(పా) ఫైనాన్స్, పిఅండ్‌పి ఎన్.బలరామ్ తెలిపారు. బుధవారం సింగరేణి ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి ప్రకాశం స్టేడియంలో గురువారం జరిగే సింగరేణి డే ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ప్రతి ఏడాది డిసెంబర్ 23వ తేదీన సింగరేణి డే వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీగా జరుగుతుందన్నారు. గత సంవత్సరం కరోనా వల్ల వేడుకలను కుదించామని తెలిపారు. ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నడిమెట్ల శ్రీధర్ పాల్గొంటారని పేర్కొన్నారు. ఉదయం స్టాల్స్‌ను ఆయన ప్రారంభిస్తారని, సాయంత్రం సాంస్కతిక కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ సాంస్కతిక కార్యక్రమాలకు సినీ, టీవీ యాక్టర్లు పాల్గొంటారని చెప్పారు. ఈ వేడుకలకు సింగరేణి అధికారులు, ఉద్యోగులు, కార్మికులు వారి కుటుంబ సభ్యులు, పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని డైరెక్టర్ బలరామ్ కోరారు. ఈ విలేకరుల సమావేశంలో సింగరేణి జిఎం వెల్ఫేర్ కె.బసవయ్య, జిఎం పర్సనల్ అందెల ఆనందరావు, బేతిరాజు తదితరులు పాల్గొన్నారు.