Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం లీగల్
బాలికపై అత్యాచారం చేసిన కేసులో సింగరేణి మండలం, ముత్యాలగూడెం గ్రామానికి చెందిన పాయం నవీన్‌కు పదేళ్లు జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ ఖమ్మం సెకండ్ ఫాస్ట్ ట్రాక్ సేషన్స్ కోర్టు(ఫోస్కో 2) న్యాయమూర్తి మహ్మద్ అఫ్రోజ్ అక్తర్ బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం ఫిర్యాది ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అ గ్రామానికి చెందిన నిందితుడు ప్రేమిస్తున్నాని, పెళ్లి చేసుకుంటానని మాయామాటలు చెప్పి 18/8/2019న ఇంట్లో ఎవరు లేని సమయంలో అత్యాచారంచేశాడు. పెళ్లి చేసుకోమని అడిగితే చేసుకోను నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దీంతో కారేపల్లి పోలీసుస్టేషన్లో ది.25/1/2020న ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి కోర్టులో చార్జీషీట్ దాఖలు చేయగా అట్టి కేసును విచారించిన న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరుపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ టి.హైమావతి వాదించగా లైజన్ ఆఫీసర్ పి.భాస్కరరావు, మోహనరావు కోర్టు కానిస్టేబుల్ సర్దార్ సింగ్ లు సహకరించారు.