Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
భారతదేశం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ప్రధానమంత్రి బాధ్యతలను చేపట్టి తన మేథా సంపత్తితో అగ్రరాజ్యాలకు తీసిపోని విధంగా అన్ని రంగాల్లో భారత దేశాన్ని తీర్చిదిద్దిన అపర చాణిక్యుడు మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు అని గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీరామావఝల రవి కుమార్ అన్నారు. గురువారం మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు వర్ధంతి కార్యక్రమాన్ని భద్రాచలం తాతగుడి సెంటర్లో నిర్వహించారు. ముందుగా పీవీ చిత్రపటానికి పూలమా లలు వేసి నివాళులర్పించి, మాట్లాడారు. అంగివీడు వెంకట్రావు, బ్రాహ్మణ సంఘం జాతీయ ప్రచార కార్యదర్శి రామాచార్యులు, ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.