Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పాల్గొన్న దేవస్థానం ఈఓ దంపతులు
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం గోదావరి తీరం శోభాయమానంగా మారింది. ఆజాద్ కా అమృత్ మహౌత్సవ్ కార్యక్రమంలో భాగంగా గురువారం భద్రాచలం శ్రీసీత ారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వ ర్యంలో గోదావరి మాతకు నదీ హారతులు, దీపోత్సవం కార్యక్రమం వైభవంగా నిర్వ హించారు. ముందుగా దేవస్థానం అర్చకులు గోదావరి మాతకు పసుపు, కుంకుమ, గాజులు, చీరె, జాకెట్ సమర్పించి పూజలు చేశారు. అనంతరం గోదావరి మాతకు ఏక, నేత్ర, బిల్వ, నాగ, పంచ, వృక్ష, నంది, సింహా, రుద్ర, చక్ర, కుంభ కర్పూర, నక్షత్ర హారతులను సమర్పించారు. అనంతరం సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయ ప్రాంగణంలో దేవస్థానం ఈఓ బి.శివాజీ దంపతులు జై శ్రీరామ్ ఆకారంలో దీపాలను అమర్చి, దీపోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈఓ, ఇరిగేషన్ ఈఈ రామ్ ప్రసాద్ మాట్లాడుతూ మానవాళి మనుగడకు నదులు అవసరం ఎంతో ఉన్నదని ఆయన అన్నారు. వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నదులను ఎంత పవిత్రంగా ఉంచితే, అవి మనలను అంత ఆరోగ్యంగా ఉంచుతాయని తెలిపారు. దేవస్థానం ఆస్థాన స్థానాచార్యులు కేఈ స్థలశాయి, ఆస్థాన అర్చకులు, వైదిక సిబ్బంది, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.