Authorization
Mon Jan 19, 2015 06:51 pm
25 వేల కోట్ల టర్నోవర్‌తో
సంస్థ అభివృద్ధి
అ 133 సంవత్సర వేడుకల్లో సింగరేణి
డైరెక్టర్ (పా) ఫైనాన్స్ ఎన్. బలరామ్
నవతెలంగాణ-కొత్తగూడెం
తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి సంస్థ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకు పోతుందని, గత 20 ఏండ్లుగా లాభాల బాటలో ఉందని సింగరేణి సంస్థ డైరెక్టర్ (పా) ఫైనాన్స్ ఎన్.బలరామ్ అన్నారు. గురువారం కొత్తగూడెం సింగరేణి ప్రకాశం మైదానంలో సింగరేణి 133వ అవిర్భావ ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. ముందుగా ఉత్సవాలకు సూచికగా భారీ బెలూన్ను నింగిలోకి ఎగుర వేశారు. అనంతరం సింగరేణి అభివృద్ధి సూచికలుగా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ప్రారభించారు. వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. సింగరేణి సంస్థ 133వ అవిర్భావ ఉత్సవాలు చేసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. 20 ఏండ్లుగా సంస్థ అభివృద్ధి పథంలో నడుస్తూ లక్షల మంది కార్మికులకు, పరిసర ప్రాంతాల ప్రజలకు ఉపాధి కేంద్రంగా మారిందని తెలిపారు. సంస్థ 25 వేల కోట్ల టర్నోవర్‌తో లాభాల్లో దూసుకుపోతోందన్నారు. భవిష్యత్తులో మరిన్ని సవాళ్లలైనా ఎదుర్కోంటు సంస్థను లాభాల బాటలో నడిపిద్దామన్నారు. గురువారం సాయంత్రం ప్రకాశం స్టేడియంలో ఏర్పాటు చేసిన వేదికమీద టివి, సినిమా కళాకారులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ ఎస్.చంద్రశేఖర్, డి. సత్యనారాయణ రావు, జీఎం పర్సనల్ అందెల ఆనందరావు, కె.బసవయ్య, లైసన్ ఆఫీసర్ మాల కొండయ్య, కె.చంద్రశేరరావు, కార్మిక సంఘాల నాయకులు బి.వెంకటరావు, వాసిరెడ్డి సీతారామయ్య, అధికారులు,కార్మికులు పాల్గొన్నారు.
ఇల్లందు బొగ్గుగనులకు పుట్టినిల్లయిన ఇల్లందులో సింగరేణి 133వ ఆవిర్భావ దినోత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించారు. తొలిసారిగా బొగ్గును కనుగొన్న విలియం కింగ్ విగ్రహానికి జీఎం మల్లెల సుబ్బారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యాలయంలో జెండావిష్కరించి వందనం సమర్పించారు. 1889లో తొలిసారిగా పూసపల్లి గ్రామంలో బొగ్గు వెలికితీత జరిగింది. అక్కడి భూగర్భగనిలో 1938 మార్చి 12న విషవాయువు వెలువడి 117 మంది అధికారులు, కార్మికులు మృత్యువాత పడ్డారు. వీరి స్మృత్యర్ధం అక్కడ గతంలో స్ధూపం నిర్మించారు. స్మృతిచిహ్నమైన స్ధూపానికి మూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనతరం జరిగిన సభలో మాట్లాడారు. వారి త్యాగం ఫలితంగానే ఇప్పటి వరకు లక్షలాది మందికి ఉపాధి లభించిందన్నారు. ఎన్నో కుటుంబాలకు జీవనాధారం దొరికిందన్నారు. నాడు నేడు వెలికి తీసిన బొగ్గు దేశానికి వెలుగులిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం బండి వెంకటయ్య, డీజీం పర్సనల్ జివి.మోహన్‌రావు, అధికారులు పాల్గొన్నారు.