Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భద్రాచలం భద్రాచలం పట్టణంలోని నిఖిత హాస్పటల్ వారికి ఓలం ఆర్గనైజేషన్ వారు ఆక్సిజన్ కాన్సంట్రేటర్‌ను వితరణగా అందజేశారు. గురువారం జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా ఓలం ఆర్గనైజేషన్ ప్రతినిథి వివేకానంద రెడ్డి, ఆసుపత్రి యజమాని డాక్టర్ తెల్లం వెంకట్రావులు మాట్లాడుతూ వివిధ రోగ సమస్యలతో హాస్పటల్‌కు వచ్చే వారికి ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ రాజేశ్వరరావు, ఎండీఓ సాయి తదితరులు పాల్గొన్నారు.