Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్
నవతెలంగాణ-సుజాతనగర్
సుజాతనగర్ మండల పరిధిలోని బేతంపూడి జామ్‌ల తండాకి చెందిన గిరిజన రైతు దారవత్ దేవ్(36) ఆత్మహత్యాయత్నానికి కారణమైన పురుగు మందుల వ్యాపారి, వేబ్రిడ్జి నిర్వహాకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బిఎస్పీ జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్ డిమాండ్ చేశారు. వేబ్రిడ్జి ద్వారా పత్తి కొనుగోలు చేసే వ్యాపారి పెట్టె ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్య యత్నం చేసి కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దారవత్ దేవ్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలా మంది రైతులను ఇలా ఇబ్బంది పెడుతున్న ఇతనిపై కేసు నమోదు చేయడంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలో జరగకుండా చూడాలన్నారు. జాతీయ రైతు దినోత్సవం రోజున వ్యాపారి వేధింపులు తాళలేక రైతు ఆత్మహత్యయత్నానికి పాల్పడటం దారుణమన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ గంధం మల్లికార్జునరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి సాయి, జిల్లా మహిళా కన్వీనర్ ఎస్.కె.షాబనా, షకీల్, వంశీ తదితరులు పాల్గొన్నారు.