Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ బస్సులో ప్రయాణించిన ఆర్టీసీ డివిజన్ మేనేజర్
నవతెలంగాణ-చండ్రుగొండ
పేద, మధ్య వర్గాలకు అందుబాటులో ఉన్న ఏకైక రవాణా సంస్థ ఆర్టీసీ అని జిల్లా రోడ్డు రవాణా శాఖ డివిజన్ మేనేజర్ సోమరాజు భవానీ ప్రసాద్ అన్నారు. ఆర్టీసీ ఎండీ ఆదేశాల మేరకు ఆర్టీసీ బస్సులో గురువారం ప్రయాణించి, ప్రయాణికుల నుంచి వారి అవసరాలను సలహాలు సూచనలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమన్నారు. చండ్రుగొండ ఆర్టీసీ బస్టాండ్‌ను త్వరలో సుందరీకరణ చేసి చండ్రుగొండ బస్టాండ్ నుంచి ముఖ్య పట్టణాలకు బస్సు సౌకర్యం కల్పించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే మారుమూల గ్రామాలకు ఆర్టీసీ బస్సులను నడుపుతున్నామని, రాబోయే రోజుల్లో మరిన్ని ఆర్టీసీ బస్సులను పెంచి గ్రామగ్రామాన ఆర్టీసీ బస్సు తిరిగేలా ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. కొత్తగూడెం డిపో నుండి చండ్రుగొండ వయా మీదుగా రాజధాని బస్సు నడపాలని ప్రయాణికులు జిల్లా మేనేజర్ భవాని ప్రసాద్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డ్రైవర్లు శేషు, పాషా, కండక్టర్ బాలరాజు, గ్రామస్తులు దడి గల నరేంద్ర, మిట్టపల్లి మోహన్ రావు, దర్గయ్య, ఇమ్రాన్, బోలా, తదితరులు పాల్గొన్నారు.