Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండ్రుగొండ
యేసు క్రీస్తు బోధనలు ప్రపంచ శాంతిని కోరుతున్నాయని దానికనుగుణంగానే క్రైస్తవు లందరూ కూడా నడుచుకోవడం సంతోషకరమని అశ్వరావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని భాస్కర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ కానుకలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా పాస్టర్లు క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలు చేసారు. అనంతరం భారీ కేక్‌ను ఎమ్మెల్యే కట్ చేసి క్రైస్తవులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిరుపేదల అందరికీ క్రిస్మస్ కానుకలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ భానోత్ పార్వతి, జెట్పీటీసి కొడకండ్ల వెంకటరెడ్డి, జెట్‌పి కో ఆప్షన్ సభ్యులు ఎస్డి రసూల్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దారా వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు, సర్పంచులు మలిపెద్ది లక్ష్మీ భవాని, బానోత్ కుమారి, ఎంపీటీసీ లంక విజయలక్ష్మి, తహశీల్దార్ ఎం.ఉష శారద, ఎంపీడీవో జి.అన్నపూర్ణ, మండల పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మండల అధ్యక్షులు కే.ఏసురత్నం, కార్యదర్శి ఎస్.లాజరస్ తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందు : అట్టడుగు వర్గాలు పేదల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే హరిప్రియ ప్రియ అన్నారు. 24 ఏరియా కమిటీ హాలులో గురువారం క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని పేదలకు బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ కానుకగా రాష్ట్రంలోని క్రైస్తవులకు దుస్తుల పంపణీ కార్యక్రమం చేపట్టారని అన్నారు. నియోజకవర్గంలోని గార్ల, బయ్యారం, కామేపల్లి, టేకులపల్లి, ఇల్లందు మండలాల్లో వందలాది మంది పేదలకు దుస్తులు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ మునిసిపల్ కౌన్సిల్, పట్టణ మండలాల ప్రజాప్రతినిధులు, పట్టణ, మండల అధ్యక్ష, కార్యదర్శులు, తెరాసా పార్టీ శ్రేణులు, పార్టీ ముఖ్యులు, నాయకులు, కార్యకర్తలు, పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.