Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్ కంభంపాటి రాంగారావు కుమారుడు డాక్టర్ కంభంపాటి సందీప్‌కు 'టైమ్స్ ఎక్సిలెన్స్ ఆవార్డు ఆఫ్ ఎమర్జెన్సీ కార్డియాలజిస్టు 2021 ఆవార్డు దక్కింది. కొత్తగూడెంలో ప్రాధమిక విద్య అభ్యసించిన డాక్టర్ సందీప్ గురువారం హైద్రాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో పురస్కారం అందుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్‌లో 16వ రాంక్ సాధించారు. ఎంబీబీస్ ప్రతీష్టాకరమైన ఉస్మానియా మెడికల్ కాలేజీలో అభ్యసించారు. ఎండిగా గుల్బర్గాలోని ఎంఆర్ఎం కాలేజ్‌లో, డీఎన్బీ ఇన్ కార్డియాలజీని అపోలోలో చేశారు ప్రస్తుతం సిటిజన్ హాస్పిటల్లో సేవలు అందిస్తున్నారు. సందీప్ భార్య గైనకాలోజిస్ట్గా అపోలో సేవలు అందిస్తున్నారు. డాక్టర్ సందీప్ సోదరి రేడియాలజిస్టు, బావ గ్యాస్ట్రోఇంటారజిస్టుగా సేవలందిస్తున్నారు. వీరి ఇంటిలో అందరూ డాక్టర్లేకావడం విశేషం. తండ్రి డాక్టర్ కంభంపాటి రంగారావు కొత్తగూడెంలో గత 40 సంవత్సరంలుగా చిన్న పిల్లల వైద్యులుగా సేవలందిస్తున్నారు. డాక్టర్ సందీప్‌కు అవార్డు దక్కడం పట్ల పట్ల పట్టణ ప్రముఖులు, డాక్టర్స్, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.