Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-అశ్వారావుపేట
ఈ సీజన్లో రైతు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం బేషరతుగా త్వరితగతిన కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య డిమాండ్ చేసారు.
గురువారం మండలంలో అశ్వారావుపేటలో ఏర్పాటు చేసిన ధాన్యం కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అశ్వారావుపేట పీఏసీఎస్ సీఈఓ విజరు బాబును ధాన్యం కొనుగోలు ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఈ సీజన్లో మూడు వేల మంది రైతులు ఏడు వేల ఎకరాల్లో వరి ధాన్యం పండించారన్నారు. ఇప్పటికే డెబ్బై శాతం కోతలు పూర్తయి, కల్లాల్లో ధాన్యం మూలుగుతున్నా ఇప్పటి వరకు 180 టన్నులు మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసిందని తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టడం బాధాకరం అని తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను రాజకీయ పావులుగా వాడుకుంటున్నారని ఆవేదన చెందారు. గతంలో మద్దతు ధర కోసం ఎదురు చూసిన రైతులు కనీసం ధాన్యం అయినా కొనుగోలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య, మండల కన్వీనర్ చిరంజీవి పాల్గొన్నారు.