Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ డిప్యూటీ డీఎంహెచ్ఓ, జిల్లా మలేరియా అధికారి వీరబాబు
నవతెలంగాణ-కరకగూడెం
గ్రామాల్లో, వసతి గృహాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించి జ్వరాలతో బాధపడేవారి నుంచి రక్త నమూనాలను సేకరించాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ, జిల్లా మలేరియా అధికారి వీరబాబు వైద్య సిబ్బందిని ఆదేశించారు.ఈ మేరకు ఆయన గురువారం మండల కేంద్రంలోని పీహెచ్సీని ఆకస్మికంగా సందర్శించి ల్యాబ్, ఫార్మసీ రికార్డులను పరిశీలించారు. సిబ్బంది అందరూ సమయపాలన పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంఓ గొంది వెంకటేశ్వర్లు, ఎస్యుఓ లింగ్యా నాయక్, వైద్యాధికారి పర్షియా నాయక్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.