Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జడ్పీ చైర్మెన్ని కలిసిన సర్పంచుల సంఘం
నవతెలంగాణ-ఇల్లందు
గ్రామ పంచాయతీలలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందించాలని మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల సర్పంచుల సంఘం నేతలు కోరారు. క్యాంపు కార్యాలయంలో గురువారం జడ్పీ చైర్మన్ కోరం కనకయ్యను కలుసుకున్నారు. పంచాయతీ కేంద్రం నుండి గ్రామాలను కలిపే రోడ్లకు జిల్లా పరిషత్ నుండి నిధులు మంజూరు చేయాలని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. జరుగుతున్న పల్లె ప్రగతి కార్యక్రమాలను వివరించారు. స్పందించిన కోరం కనకయ్య మాట్లాడుతూ గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు, సర్పంచులు కుంజా కృష్ణ, మంకీడి కృష్ణ, స్వాతి, వెంకట నర్సు, తిరుపతి, మోకాళ్ళ కృష్ణ, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ తాటి బిక్షం, ఆలెం కృష్ణ, ఎంపీటీసీ మండల రాము తదితరులు పాల్గొన్నారు.