Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి కృతజ్ఞతలు తెలిపిన కౌన్సిలర్ పద్మ
నవతెలంగాణ-ఇల్లందు
పట్టణంలోని 2వ వార్డు కౌన్సిలర్ కటకం పద్మ భర్త కటకం దయాకర్ అనారోగ్యం బారిన పడి హైదరాబాదు నిమ్స్ ఆస్పత్రిలో వైద్యం పొందుతున్నారు. చికిత్స నిమిత్తం వైద్య ఖర్చులకు రూ.3 లక్షల ఖర్చువుతుందని వైద్యులు తెలిపారు. దీంతో నియోజకవర్గ ఎమ్మెల్యే హరిప్రియ హరి సింగ్ నాయక్ దృష్టికి ఇల్లందు మున్సిపల్ వైస్ చైర్మన్ సయ్యద్ జానీ పాషా తీసెకెళ్ళారు. స్పందించిన ఎంఎల్ఏ హరిప్రియ ప్రత్యేక చొరవతో సీఎం కేసీఆర్ సహాయనిధి నుండి రూ.3 లక్షల చెక్కును మంజూరు చేయించారు. కుటుంబాన్ని ఆదుకుని పెద్ద మనసుతో సకాలంలో స్పందించి సహాయం చేసిన ఎంఎల్ఏ హరిప్రియ, ఎంఎల్సీ తాత మధు, మార్కెట్ కమిటీ చైర్మెన్ హరి సింగ్ నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ సయ్యద్ జానీ పాషాలకు కౌన్సిలర్ కటకం పద్మ కృతజ్ఞతలు తెలిపారు.