Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రైతు సంఘం ఆధ్వర్యంలో
మిర్చి తోటలు పరిశీలన
అ 27న రైతులతో కలెక్టరేట్ ఎదుట ధర్నా
అ రైతు సంఘం నాయకులు కాసాని
నవతెలంగాణ-చండ్రుగొండ
మిర్చి పంటలో వచ్చిన వైరస్ను ప్రకృతి వైపరీత్యం ప్రభుత్వం గుర్తించాలని, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని పోకలగూడెం గ్రామంలో వైరస్ సోకిన మిర్చి తోటలను రైతు సంఘం, ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు కాసాని అయిలయ్య మాట్లాడారు.
పంట వేసిన దగ్గర నుండి కాపు వరకు వంట భాగానే ఎదిగింది. పూత కాపు కాయ కాసేసరికి మిర్చి తోటలోకి ఎర్ర నల్లి, నల్ల నల్లి, తామర పురుగు వంటి వైరస్లు సోకడం వల్ల ఎన్ని పురుగుల మందు కొట్టినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రుణమాఫీ చేసి అప్పు ఇవ్వకపోవడంతో ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అప్పులు తెచ్చి పంటకు పెట్టుబడి పెట్టి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పంట నష్ట పరిహారం చెల్లించాలని ఆయన అన్నారు. ఈ నెల 27న మిర్చి తోట రైతులు అందర్నీ సమీకరించి కలెక్టరేట్ ముందు ధర్నా చేయబోతున్నామని, ఈ ధర్నాకి రైతులందరూ పాల్గొనాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కొండపల్లి శ్రీధర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.