Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
కారేపల్లి మండలం ఎర్రబోడులోని పల్లె ప్రకృతి వనం పుడమి పై పచ్చదనం పరచుకున్నదా అన్నట్లు పచ్చని చెట్లతో కళకళలాడుతుంది. సర్పంచ్ కుర్సం సత్యనారాయణ ఆధ్వర్యంలో పల్లె ప్రకృతి వనం పై ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ వివిధ జాతుల చెట్లలను వనంలో నాటి, మొక్కల సంరక్షణకు స్వయంగా చూస్తున్నారు. గ్రామస్తులు ఆటవిడుపు కొరకు పల్లె ప్రకృతి వనంలో సేదతీరుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ కుర్సం సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామంలో పారిశుద్ధ్యం, ప్రకృతి వనం, తాగునీరు వంటి మౌలిక సమస్యలపై దృష్టిపెట్టి గ్రామస్తుల సహకారంతో పంచాయతీ అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు.గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు సకాలంలో అందక సర్పంచులు అప్పుల ఊబిలో కూరుకు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీలో పనులు చేసిన వాటికి నిధుల విడుదలలో జాప్యం తో అవస్థలు పడుతున్నట్లు పేర్కొన్నారు ప్రభుత్వం నిధుల విడుదలకు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.