Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా నిర్వహించామని త్రివేణి పాఠశాలల డైరెక్టర్ డాక్టర్ వీరేంద్ర చౌదరి అన్నారు. గురువారం పాఠశాల లో జాతీయ రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి రైతు వెన్నెముకు కడుపు నిండా మనం అన్నం తింటున్నా మంటే దానికి కారణం రైతుఅనీ దేశాన్ని రక్షించే జనాలకు ఎంత ప్రాముఖ్యత ఉంది. అన్నం పెట్టే రైతుకు అంతే ప్రాముఖ్యత ఉందని విద్యార్థులకు తెలిపారు. ఈ ప్రత్యేకమైన రోజున త్రివేణి యాజమాన్యం ఒక లక్ష రూపాయలను ''భారతీయ కిసానే నిధి''కి సహాయార్థం గవర్నరి చేతుల మీదుగా ఇవ్వడం జరుగు తుందని తమ వంతు సహాయార్ధంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు విరాళాలు అంద జేసారు. చిన్నారులు రైతుల వేషధారణలో వచ్చి చూపరులను ఎంతో ఆకట్టుకున్నారు. ప్రతి ఏటా విద్యార్థులను, తీసుకు వెళ్ళి రైతు కష్ట సుఖాలను గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధిస్తారు. ఈ కార్యక్రమంలో కృష్ణవేణి- త్రివేణి పాఠశాలల అధిపతి వై.వెంకటేశ్వరరావు , సి.ఆర్.ఒ. మురళీకృష్ణ, ప్రిన్సిపాల్ పి.రాజేంద్రప్రసాద్, ఇంచార్జి యం.డి. ముస్తఫా, కిడ్స్ ఇన్చార్జి శ్రీదేవి, క్యాంపస్ జి. చార్లెసి, ట్రాన్సి పోర్టీ ఇంచార్జి కె. సందీప్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.