Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎర్రుపాలెం
నూతనంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం సాధించిన తాత మధుసూదన్‌ను ఎర్రుపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులు మూల్పూరి శ్రీనివాసరావు శనివారం ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మండల పరిధిలోని జమలాపురం గ్రామానికి చెందిన పంచాయతీ సర్పంచ్ మూల్పూరి స్వప్న శ్రీనివాసరావు దంపతులు ఇటీవల తి రుపతి వెళ్లి స్వామివారిని దర్శించుకుని వచ్చిన సందర్భంగా స్వామివారి తీర్థ ప్రసాదాలను ఎమ్మెల్సీ మధుసూదన్‌కు అందించారు. మధుసూదన్ విజయం పట్ల వారు తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ మధుసూదన్‌ను అభినందించారు. తనను అభినందించి, శుభాకాంక్షలు తెలిపిన శ్రీనివాసరావు దంపతులకు తాత మధుసూదన్ కృతజ్ఞతలు తెలిపారు.