Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - బోనకల్
ప్రస్తుతం నూతన జిల్లాలకు కేటాయించిన ఉపాధ్యాయులకు తాత్కాలికంగా పాఠశాలలు కేటాయించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి గుగులోతు రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. మండల కేంద్రంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాత జిల్లాలకే కేటాయించబడిన ఉపాధ్యాయుల్లో పదేళ్ళకు పైగా అదే స్థానాల్లో కొనసాగుతున్న వారున్నారని, ఇప్పుడు కొత్త జిల్లాలకు కేటాయించిన వారిలో పలువురు సుదీర్ఘ కాలం మారుమూల ప్రాంతాల్లో పని చేసిన వారు ఉన్నారన్నారు. వీరందరికీ న్యాయం జరగాలంటే స్టేషన్ సీనియారిటీ, సర్వీసు సీనియారిటీకి పాయింట్లు కేటాయించి బదిలీలు చేయాలని కోరారు. విద్యాశాఖ సమగ్రమైన బదిలీ నిబంధనలు రూపొందించిన అనంతరమే సాధారణ బదిలీలు, పదోన్నతులు ఏక కాలంలో నిర్వహించాలని కోరారు. ఉపాధ్యాయ సంఘాలు చేసిన సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధ్యాయులందరికీ న్యాయం చేయాలని, క్లియర్ వేకెన్సీలతో పాటు , ఇతర జిల్లాలకు కేటాయించబడిన ఉపాధ్యాయుల ఖాళీలను కూడా కౌన్సిలింగ్ లో చూపెట్టి, సమగ్రమైన సీనియారిటీ జాబితా విడుదల చేసి, అప్పీల్స్ తీసుకుని పైనల్ జాబితా విడుదల చేసి కౌన్సిలింగ్ నిర్వహించాలని వారు కోరారు. 2018 కౌన్సిలింగ్లో ఉన్న బదిలీల నిబంధనలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం సంఘాల సూచనలు పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదన్నారు. విలేకరుల సమావేశంలో టిఎస్ యుటిఎఫ్ జిల్లా కోశాధికారి వల్లంకొండ రాంబాబు, మండల అధ్యక్షులు భూపతి ప్రీతం, ఉపాధ్యక్షులు కంభం రమేష్, ఉపాధ్యక్షురాలు పి.సుశీల, కోశాధికారి పి.పుల్లారావు, ఎంసిఆర్ చంద్ర ప్రసాద్, శ్రీనివాసరావు, ఈ గోపాల్రావు, పీ.నరసింహారావు, కె.నాగలక్ష్మి, కే.అనిల్ కుమార్, కె.సౌభాగ్య లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.