Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నూతన సంవత్సర వేడుకలకు ప్రత్యేక ఆఫర్లు
నవతెలంగాణ- సత్తుపల్లి
సత్తుపల్లిలోని కల్పతరు రోడ్డులో గల స్వర్ణ రెస్టారెంట్ 23వ వార్షికోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో టీఆర్ఎస్ జిల్లా నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజరుకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్‌చేశారు. పట్టణంలోని ప్రజలకు రుచితో పాటు శుచిగా ఆహార పదార్థాలను అందిస్తూ మన్ననలు పొందడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ నిర్వాహకులు నర్రా లక్ష్మణరావు, నర్మద దంపతులు మాట్లాడుతూ నాణ్యతలో రాజీ పడకుండా సేవలు అందించడం తమ ప్రత్యేకత అన్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా కొత్త రుచులతో పలు బిర్యానీ రకాలను ఆఫర్లతో వినియోగదారులకు అందించనున్నట్లు ఆయన తెలిపారు. డీసీసీబీ మాజీ చైర్మెన్ మువ్వా విజరుబాబు సారధ్యంలో గత 23 ఏండ్ల కిందట ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించినట్టు లక్ష్మణ్‌రావు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇమ్మనేని ప్రసాద్, కూకలకుంట దయాకర్ (మానస నాని), బత్తుల భరత్, మువ్వా జగదీశ్, మాచినేని పిచ్చయ్య, బండి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు.